zee5-crazylineup-nbk111-venky-anil5
భారతీయ ఓటీటీ రంగంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది ప్రముఖ స్వదేశీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5). ఏకంగా 7 భారతీయ భాషల్లో అతిపెద్ద మల్టీ-లాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కంటెంట్, యానిమేషన్, పిల్లల వినోదం వంటి విభిన్న విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను జీ5 ప్రకటించింది.
zee5-crazylineup-nbk111-venky-anil5
తెలుగు ప్రేక్షకులకు క్రేజీ లైనప్
తెలుగులో జీ5 ఈసారి భారీ ప్రాజెక్టులతో ముందుకొస్తోంది. కొత్త ఒరిజినల్స్‌గా ‘శ్రీమతి’ (నివేథా థామస్), ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (శ్రీకాంత్) స్ట్రీమింగ్ కానుండగా, సూపర్ హిట్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కొత్త సీజన్‌తో తిరిగి రానుంది.
అంతేకాదు, థియేటర్ల తర్వాత జీ5లో స్ట్రీమింగ్ కానున్న సినిమాల జాబితాలో ‘NBK111’, ‘వెంకీ అనీల్ రావిపూడి5’, ‘వృషకర్మ’ వంటి భారీ ప్రాజెక్టులు ఉండటం తెలుగు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
7 భాషల్లో భారీ విస్తరణ
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ కొత్త ఒరిజినల్స్, వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, రియాలిటీ షోలు, ఫ్రాంచైజీల కొత్త సీజన్లను జీ5 ప్రకటించింది. ప్రాంతీయ కథలకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రతి భాష సంస్కృతిని ప్రతిబింబించేలా కంటెంట్ రూపొందిస్తున్నామని సంస్థ తెలిపింది.
అగ్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం
ఈ మెగా కంటెంట్ లైనప్ కోసం దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు, కంటెంట్ క్రియేటర్లతో జీ5 చేతులు కలిపింది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్ వంటి ప్రముఖ సంస్థలు జీ5తో కలిసి పనిచేస్తున్నాయి.
సినిమాలకే కాదు.. స్పోర్ట్స్, AI, యానిమేషన్ కూడా
స్క్రిప్టెడ్ కంటెంట్‌కే పరిమితం కాకుండా జీ5 తన ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరిస్తోంది. FIFA ఫుట్‌బాల్ టోర్నమెంట్లు, బుండెస్లిగా, కబడ్డీ లీగ్స్‌తో పాటు AI ఆధారిత కథలు, యానిమేషన్ ప్రాజెక్టులు, పిల్లల కోసం ప్రత్యేక కంటెంట్‌ను కూడా అందించనుంది.
ఈ సందర్భంగా జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ, ట్రెండ్స్‌ను అనుసరించడం కాదు, కొత్త ట్రెండ్స్‌ను సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కంటెంట్ లైనప్ కేవలం టైటిల్స్ జాబితా మాత్రమే కాదని, భారతీయ ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందించాలనే జీ5 విజన్‌కు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.