Venkatesh On-Screen Daughter Revealed
హెడ్ లైన్ చూసి ఇదేదో నిజం అనుకునేరు. కానీ ఇది రియల్ కాదు.. రీల్ లైఫ్ డాటర్ను పరిచయం చేశారు. అసలు విషయానికొస్తే.. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న మేకర్స్… ఇప్పుడు కుటుంబంలోని మరో కీలక సభ్యురాలిని పరిచయం చేశారు. ఈ చిత్రంలో చిట్టిబాబు (విక్టరీ వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి) దంపతుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి కనిపించనుంది.
Venkatesh On-Screen Daughter Revealed

అమాయకత్వం, చిలిపితనం, అల్లరి… ఈ మూడు లక్షణాల కలయికే సంపూర్ణ పాత్ర. ఇంట్లో అందరినీ నవ్వించే ఈ చిన్నారి, తన అల్లరితో అనుకోని సంఘటనలకు కూడా కారణమవుతుందని చిత్ర బృందం చెబుతోంది. కథలో ఈ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు, ప్రేక్షకులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో యువినా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న.. ఐయామ్ ఇన్ లవ్ అని వెంకటేష్‌కు చెబుతుంది. దీనికి వెంకీ చిరాకుగా ముఖం పెట్టి.. ‘ఈసారి ఎవడే.. కారు మెకానిక్ ఆ అని.. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా’ అడుగుతాడు’ దీనికి ఆమె కూతురు పాత్ర పోషించిన యువినా ‘నీకు ఎలా తెలుసు అని అడుగుతూ..నాకు ఏం అవుతుందో అనే బాధ కన్నా, వాడికి ఏం అవుతుందో అని భయం ఎక్కువ అయితే అదే ప్రేమ’ అని చెప్పడం హిలేరియస్‌గా అనిపిస్తుంది.
ఇప్పటికే చిట్టిబాబు, స్వర్ణ పాత్రల పరిచయానికి మంచి స్పందన రాగా, ఇప్పుడు సంపూర్ణ క్యారెక్టర్ రివీల్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. త్వరలోనే ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ కథకు వినోదాన్ని, భావోద్వేగాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.