I Hate Marriage Telugu Movie Review
చిత్రం : ఐ హేట్ మ్యారేజ్ (I Hate Marriage)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, జకీర్, లోహిత్ కుమార్, ప్రభావతి తదితరులు
బ్యానర్ : ఆర్య సినిమా
నిర్మాతలు : దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : పరమేష్ రేణుకుంట్ల
సంగీత దర్శకుడు : వరికుప్పల యాదగిరి
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : విజయ్ సి. కుమార్
ఎడిటర్ : ఆవుల వెంకటేష్
విడుదల తేదీ : నవంబర్ 27, 2026
I Hate Marriage Telugu Movie Review
కథ విషయానికొస్తే..
హైదరాబాద్‌లోని ఓ లేడీస్ హాస్టల్లో ఉండే జాహ్నవి (జుప్సీ భద్ర), మీనాక్షి (హారిక రాజేందర్), భారతి (సాహితి కృష్ణ) జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఉద్యోగం చేస్తూ పెళ్లి వద్దంటూ తనకు నచ్చినట్లు బతికే అమ్మాయి మీనాక్షి. ఉద్యోగం కోసం పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి మోసపోయినా ప్రయత్నాలు కొనసాగించే యువతి భారతి. ఇక జాహ్నవికి ప్రేమ, రొమాన్స్, ఎంజాయ్మెంట్ కావాలి. కానీ పెళ్లి మాత్రం తండ్రి చూపించిన అబ్బాయితోనే చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు నచ్చిన బాయ్‌ఫ్రెండ్ కోసం వెతుకుతున్న ఆమెకు సినిమా డైరెక్టర్ కావాలని ప్రయత్నించే రామ్ (సుగి విజయ్) పరిచయమవుతాడు. వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ముగ్గురి కథలు ఎలాంటి మలుపులు తిరిగాయనేదే సినిమా.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
జాహ్నవి పాత్రలో జుప్సీ భద్ర ఆకట్టుకుంది. మోడ్రన్ అమ్మాయిగా, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మంచి నటన కనబరిచింది. సుగి విజయ్ తన పాత్రకు న్యాయం చేశారు. మీనాక్షిగా హారిక రాజేందర్ బోల్డ్ పెర్ఫార్మెన్స్తో మెప్పించింది. భారతి పాత్రలో సాహితి కృష్ణ భావోద్వేగాలను పండించింది. హాస్టల్ వాచ్‌మెన్‌గా డాక్టర్ పృథ్వీరాజ్ అక్కడక్కడా నవ్వించారు. రవివర్మ, ప్రభావతి, మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీమ్ గురించి..
విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. వరికుప్పల యాదగిరి పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సినిమా ఎలా ఉందంటే..
ప్రేమ, పెళ్లి, కెరీర్ విషయంలో నేటి యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయనే అంశాలను బోల్డ్‌గా చూపించే ప్రయత్నమే ఈ సినిమా. ముగ్గురు అమ్మాయిలకు మూడు విభిన్నమైన ఆలోచనలు ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, జాహ్నవి-రామ్ మధ్య పరిచయం, హాస్టల్ సన్నివేశాలు ప్రధానంగా సాగుతాయి. పృథ్వీరాజ్ కామెడీ కొంత రిలీఫ్ ఇస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. సెకండాఫ్‌లో రామ్-జాహ్నవి ప్రేమ, రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మీనాక్షి పాత్ర ద్వారా పెళ్లిపై భిన్నమైన ఆలోచనలను, భారతి పాత్ర ద్వారా ఉద్యోగాల కోసం అమ్మాయిలు పడే కష్టాలను చూపించారు. కొన్ని సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నా, కథలో అక్కడక్కడా లాజిక్ మిస్ అవుతుంది. క్లైమాక్స్ కూడా మరింత బలంగా ఉండాల్సింది. అయినప్పటికీ బోల్డ్ కంటెంట్, యూత్‌ఫుల్ అంశాలతో సినిమా ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
ముగ్గురు అమ్మాయిల విభిన్న పాత్రలు
జుప్సీ భద్ర నటన
బోల్డ్ కంటెంట్
పృథ్వీరాజ్ కామెడీ
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కొన్ని ల్యాగ్ సీన్స్
రొటీన్ ప్రేమకథ
క్లైమాక్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
ముగ్గురు అమ్మాయిల మూడు రకాల ఆలోచనలు, ప్రేమ, పెళ్లి, కెరీర్ చుట్టూ తిరిగే బోల్డ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’. కథలో కొత్తదనం, బలమైన ముగింపు లేకపోయినా నటీనటుల పెర్ఫార్మెన్స్, కొన్ని ఆసక్తికరమైన అంశాలు సినిమాకు ప్లస్. యూత్ ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు.