యూత్‌ను ఆకట్టుకునే ప్రేమ, కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా వంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వం వహిస్తున్నారు. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై సావిత్రమ్మ చెరుకూరు నిర్మిస్తుండగా, బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. నగరాలకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత ఎదుర్కొనే సమస్యలు, వారి అనుభవాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించినట్లు చిత్ర రచయిత శ్రీధర్ తెలిపారు. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని చెప్పారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ.. సినిమాలో అల్లరి, బబ్లీ అమ్మాయిగా కనిపిస్తానని, కథ ముందుకు సాగుతున్న కొద్దీ తన పాత్రలో మార్పు వస్తుందని తెలిపారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ.. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించానని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా సినిమా ఉంటుందని చెప్పారు. ఈ నెల 27న విడుదలవుతున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ.. ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’లో కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. బీటెక్ పూర్తి చేసి సిటీలో కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చే యువత ఎదుర్కొనే ఇబ్బందులను తన పాత్ర ద్వారా చూపించినట్లు చెప్పారు. సినిమాలో సిద్ధు పాత్రలో నటించానని, పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవీ రావు మాట్లాడుతూ.. యువతకు నచ్చే కథాంశంతో రూపొందిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూత్‌ఫుల్ కథ, వినోదం, భావోద్వేగాల కలయికగా రూపొందిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ఈ నెల 27న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.