Rakesh Varre Mayaledy Trailer Launch
యంగ్ హీరో, నిర్మాత రాకేష్ వర్రే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా ‘మాయలేడి’. ప్రశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుమిత సర్కార్ హీరోయిన్గా నటించింది. గతంలో ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలను నిర్మించిన రాకేష్.. ఈసారి ప్రేమ, సంగీతం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారు. ఈ నెల 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Rakesh Varre Mayaledy Trailer Launch
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశంకర్ మాట్లాడుతూ.. ప్రేమలో ఉండే సంతోషం, కోపం, ఇతర భావోద్వేగాలను ఒక అబ్బాయి ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ అని తెలిపారు. క్రిష్ అనే యువకుడి జీవితంలో ఎదురయ్యే రిలేషన్షిప్ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, మంచి మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న సందేశం కూడా ఉంటుందని చెప్పారు.
హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ.. ‘మాయలేడి’ తనకు తెలుగులో తొలి సినిమా అని, తన పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో, నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ.. రెండేళ్ల విరామం తర్వాత ఒక మంచి సినిమాతో వస్తున్నానని చెప్పారు. ‘పేకమేడలు’, ‘ఎవరికీ చెప్పొద్దు’ తర్వాత ఈసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయాలని భావించినట్లు తెలిపారు. ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఖుషి’ వంటి చిత్రాల్లో కనిపించే ప్రేమ, సంగీతం, కుటుంబ వినోదం ఈ సినిమాలో ఉండాలని ప్రయత్నించినట్లు వెల్లడించారు.
మ్యూజిక్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి విశాల్ చంద్రశేఖర్‌ను తీసుకున్నామని, కథకు తగ్గట్టుగా ఆయన అద్భుతమైన సంగీతం అందించారని పేర్కొన్నారు. తన మార్కెట్‌ను మించి ఖర్చు పెట్టి రాజీ పడకుండా సినిమా నిర్మించానని, ‘మాయలేడి’ తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమని చెప్పారు.
ప్రస్తుతం వరుస యాక్షన్ చిత్రాల మధ్య ‘మాయలేడి’ ఒక రిఫ్రెషింగ్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని, ప్రేక్షకులు థియేటర్లలో హాయిగా సినిమా చూసి సంతోషంగా బయటకు వస్తారని ప్రామిస్ చేస్తున్నానని రాకేష్ వర్రే తెలిపారు.