‘పోచమ్మ’ సిరీస్ మంచి సౌండ్ చేస్తుంది

  • NaniNani
  • OTT
  • April 16, 2026
  • 0 Comments

తెలుగు ఓటీటీ ఆహాలో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీపూజ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేశ్ ఇందిర దర్శకత్వంలో శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘‘- కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. “పోచమ్మ” వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు.. స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది”అని అన్నారు. నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ -‘‘ఈ సిరీస్ లో జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది”అని చెప్పారు. నటి శ్రీ పూజ మాట్లాడుతూ ‘‘- ఈ సిరీస్ మొదలైనప్పుడే సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఇది తమిళ, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తప్పకుండా ఎంగేజ్ చేసేలా ఉంటుంది”అని చెప్పారు. ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ ‘‘ ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించిందని అనిపించింది. ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది” అని అన్నారు.

Related Posts

ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని