తెలుగు ఓటీటీ ఆహాలో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీపూజ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేశ్ ఇందిర దర్శకత్వంలో శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘‘- కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. “పోచమ్మ” వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు.. స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది”అని అన్నారు. నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ -‘‘ఈ సిరీస్ లో జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది”అని చెప్పారు. నటి శ్రీ పూజ మాట్లాడుతూ ‘‘- ఈ సిరీస్ మొదలైనప్పుడే సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఇది తమిళ, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తప్పకుండా ఎంగేజ్ చేసేలా ఉంటుంది”అని చెప్పారు. ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ ‘‘ ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించిందని అనిపించింది. ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది” అని అన్నారు.






