Sharwa ManasaVaranasi George Krish Dubbing Begins
వరుస విజయాలతో జోరు మీదున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ మరో హిట్‌పై కన్నేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జార్జ్ క్రిష్’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది.
Sharwa ManasaVaranasi George Krish Dubbing Begins
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ మానస వారణాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానస తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆమె డబ్బింగ్ చెబుతున్న వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా నిర్మాణ పనులు విడుదల దిశగా మరింత వేగం పుంజుకున్నాయి.
ఇప్పటికే విడుదలైన ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. క్రిస్టియన్ యువకుడిగా జార్జ్, హిందూ యువకుడిగా క్రిష్ పాత్రల్లో ఆయన కనిపించనున్నాడు. రెండు భిన్నమైన నేపథ్యాలు, విభిన్నమైన పరిస్థితుల్లో సాగే ఈ పాత్రల పరిచయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
హాస్యం, రొమాన్స్, కుటుంబ భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీను వైట్ల రూపొందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ‘జార్జ్ క్రిష్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.