Rajinikanth Dharman Gets Two Big Telugu Stars
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. కమల్ హాసన్ నిర్మాణంలో, అశ్వత్ మారుముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సిమ్రాన్, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా వరుసగా ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.
Rajinikanth Dharman Gets Two Big Telugu Stars
ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి సమయంలో హీరోయిన్ రాశీఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం మైసూర్లో ‘ధర్మన్’ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రజినీకాంత్, రామ్‌తో కలిసి దిగిన ఫొటోను రాశీఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఎర్లీ మార్నింగ్ వర్కవుట్స్ విత్ దిస్ టూ స్టార్స్” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమాలో రామ్ నటిస్తున్న విషయం దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక కథ విషయానికి వస్తే.. అవినీతిపై పోరాటం చేసే డాక్టర్ ధర్మన్ పాత్రలో రజినీకాంత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. రాశీఖన్నా ఆయన కూతురి పాత్రలో, రామ్ ఆమె భర్త పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరి పాత్రలపై మేకర్స్ నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
రామ్ తర్వాత శ్రీలీల.. మరో క్రేజీ ఎంట్రీ!
ఇప్పటికే రామ్ ఎంట్రీతో ఆసక్తిని పెంచిన ‘ధర్మన్’లోకి మరో యంగ్ హీరోయిన్ అడుగుపెట్టినట్టు తాజాగా తెలిసింది. ఈ సినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమె ‘ధర్మన్’ షూటింగ్లో జాయిన్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీల ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనుంది? కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది? రజినీకాంత్, రామ్, రాశీఖన్నాలతో ఆమెకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి.
ఒకవైపు రామ్ లాంటి స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తుండగా.. మరోవైపు శ్రీలీల కూడా జాయిన్ కావడంతో ‘ధర్మన్’పై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. మేకర్స్ అధికారికంగా ఒక్కొక్కరి పాత్రలను రివీల్ చేస్తే సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి షూటింగ్ దశలోనే వరుస సర్ప్రైజ్లతో ‘ధర్మన్’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది.