amit shah views puranapanda srinivas nenunnanu hanuman book
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 29: ఈ దేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా కి ఖాళీ సమయం దొరకడం చాలా కష్టం. అలాంటి అమిత్ షా కి ఎప్పుడైనా మూణ్ణెల్లకో, నాల్గు నెలలకో ఒకసారి ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే తెలుగు చలన చిత్ర నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనంగా ఐదువందల హనుమాన్ కళా ఖండాల, వర్ణచిత్రాలతో భారతదేశంలోనే తొలిసారిగా తెలుగు జాతికి అందిన ‘నేనున్నాను’ మహా గ్రంధాన్ని తెరచి చూస్తారని ఇటీవల బీజేపీ అగ్ర నాయకులు చర్చించుకోవడం జరిగింది.

పురాణపండ శ్రీనివాస్ విశేష ప్రతిభా సామర్ధ్యాలతో యంత్ర తంత్ర మంత్రాత్మకంగా అందమైన వ్యాఖ్యానాలతో ఉపాస్య గ్రంధంగా అందిన ఈ అఖండ గ్రంధాన్ని గత ఐదేళ్ల నాడు న్యూఢిల్లీ లోని తన కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్య వేక్షణలో అమిత్ షానే ఆవిష్కరించడం ఒక ప్రత్యేకతగా చెప్పక తప్పదు.
వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇటీవల ఏడవ ముద్రణగా ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ జ్ఞానమహా యజ్ఞ కేంద్రం సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ సృజన పతాక స్థాయితో శోభాయమానంగా రూపు దిద్దుకున్న ఈ నేనున్నాను గ్రంధాన్ని మరికొన్ని విశేషాలతో అమిత్ షా కార్యాలయానికి తెలంగాణా అగ్రశేణి బిజెపి నేత చేర్చడంతో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా క్రొత్త గ్రంధాన్ని ప్రశాంతంగా తిలకించి రెండు ప్రతులు తన సొంత కార్ లో కూడా పెట్టుకున్నారని బీజేపీ కార్యాలయం ప్రముఖులు తెలుపుతున్నారు.

మొదటి ప్రచురణలో అట్ట వెనుక భాగంలో ఉన్న సాయి కొర్రపాటి పేరు … ఇప్పుడు ఏడవ ప్రచురణగా బయటికొచ్చిన ఈ నేనున్నాను గ్రంధం మొదటి పేజీ లోకి చేరడమే కాకుండా సాయి కొర్రపాటికి ఎంతో కృతజ్ఞతగా రచయిత పురాణపండ శ్రీనివాస్ రాసిన ఆసక్తికర వ్యాఖ్యానాలు మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయంటున్నారు.
క్రొత్త క్రొత్త ఆంజనేయ చిత్రాలు, పవిత్రమైన వర్ణనలు, విశేష వ్యాఖ్యానాలు, సౌందర్యాలు వెదజల్లే అమోఘ భాషా సౌందర్యం.. వీటితో ఈ పుస్తకం నిండిపోయి హనుమంతుని మన కన్నుల ఎదుట సాక్షాత్కరించేంత అద్భుతం జరుగుతుంది. ప్రతీ పేజీలో పురాణపండ శ్రీనివాస్ కఠోర పరిశ్రమ, భక్తి దర్శనమిస్తుంది.
సాయి కొర్రపాటి మొదటి ప్రచురణలోనే ఈ గ్రంధాన్ని ఎంతో మంది తెలుగు సినీ ప్రముఖులకు అందజేయడంతో ఈ బుక్ ఆనాడే ఆకర్షించి.. ఎంతోమంది నిర్మాత దర్శకులచే శభాష్ ‘సాయి కొర్రపాటి’ ఎంతో విలువైన అద్భుతాన్ని బహుమతిగా ఇచ్చావంటూ ప్రశంసలు వర్షించడం ఎంతోమంది సినీ ప్రముఖులకు ఎరుకే.
ఇక పోతే … పురాణపండ శ్రీనివాస్ పెన్ను పడ్డ ప్రతీ పుస్తకం హిట్టే!
తెలుగు భక్త పాఠకుడికి ఆయన ఒక తేనె తుట్టే!!
amit shah views puranapanda srinivas nenunnanu hanuman book
ఏదేమైనా ఆంజనేయ స్వామి వారి మహా భక్తులైన అమిత్ షా వంటి మహా రాజకీయ దిగ్గజం తెలుగువారి బడా హనుమాన్ బుక్ ‘నేనున్నాను’ను ఇష్టపడటం మనకెంతో ఆనందం. ఆశ్చర్యం. అద్భుతం.