వైవిధ్యమైన కథలు, కొత్త తరహా కథనాలతో ప్రేక్షకులను అలరించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమ, సంగీతం, సస్పెన్స్, మానసిక సంఘర్షణల కలయికతో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా ఈ చిత్ర బృందం యంగ్ హీరో తిరువీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సినిమా కథాంశం, నిర్మాణ విశేషాలు, ప్రత్యేకతలను ఆయనకు వివరించింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత అలేటి రాజేష్ మాట్లాడుతూ.. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా సరికొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేమ, సంగీతం, సస్పెన్స్‌తో పాటు పాత్రల మధ్య చోటుచేసుకునే మానసిక సంఘర్షణలు కథలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
దర్శకుడు రామమూర్తి కొట్టాల (BFA) మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కథనం, ఊహించని మలుపులతో ఈ సినిమాను తెరకెక్కించామని తెలిపారు. ప్రేమ, సంగీతం నేపథ్యంలో సాగే కథలో సైకలాజికల్ సస్పెన్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అన్నారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తిని కొనసాగించేలా కథనాన్ని రూపొందించామని పేర్కొన్నారు.
టింట్స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై అలేటి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సి.ఎన్. ఆదిత్య సంగీతం అందిస్తుండగా, భువన్ విక్రమాదిత్య కొట్టాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ కుమార్ రెడ్డి ఎడిటర్‌గా, సురేష్ మండల (BFA) ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వినయ్ మాస్టర్, మణికంఠ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రిషి DI బాధ్యతలు చేపట్టగా, మధుర ఆడియో ద్వారా సినిమా పాటలు ప్రేక్షకులకు చేరువ కానున్నాయి.