Poorvaj Killer OTT Release
చిన్న సినిమా.. పెద్ద విజయం! బలమైన కథ, కొత్త తరహా కథనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది సెన్సేషనల్ సై-ఫై థ్రిల్లర్ ‘కిల్లర్’. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Poorvaj Killer OTT Release
‘కిల్లర్’ థియేట్రికల్ విజయంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా హక్కులపై ఆసక్తి చూపించాయి. చివరకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ మొత్తాన్ని వెచ్చించి ఫ్యాన్సీ ప్రైస్‌కు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఒక చిన్న చిత్రానికి ఇంత మంచి డీల్ రావడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమా సదరు ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ తేదీ, ఓటీటీ సంస్థ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ధ్యానం నాన్నగారి ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రలోనూ నటించారు. దర్శకుడిగా, నటుడిగా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.
థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి, ఇప్పుడు ఫ్యాన్సీ ఓటీటీ డీల్‌ను సొంతం చేసుకున్న ‘కిల్లర్’ డిజిటల్ రిలీజ్‌తో మరెంతమంది ప్రేక్షకులకు చేరువవుతుందో చూడాలి.