Peddi dayone collections, ticket sales Records
‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రారంభం.. తొలి రోజే ఎంత కలెక్షన్ అంటే..
‘పెద్ది’ బాక్సాఫీస్ ఛాంపియన్.. చరణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
Peddi dayone collections, ticket sales Records
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభం నమోదు చేసింది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన కలెక్షన్స్ పోస్టర్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పోస్టర్లో రామ్ చరణ్ పవర్ఫుల్ లుక్‌తో కనిపించగా, వెనుక భాగంలో హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘బాక్సాఫీస్ చాంపియన్’ అనే ట్యాగ్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్‌లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి రోజు రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ‘పెద్ది’ వీకెండ్ ముగిసేలోపు మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు టికెట్ అమ్మకాల విషయంలోనూ ‘పెద్ది’ చిత్రం మరో భారీ మైలురాయిని అందుకుంది. “Sensational 3 Million+ Tickets Sold” అని ప్రకటిస్తూ మేకర్స్ మరో స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు కలిపి 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్‌తో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా కథను ఎమోషన్‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించగా, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. సినిమాపై ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, మాస్ ఆడియన్స్ నుంచి లభిస్తున్న భారీ రెస్పాన్స్ కారణంగా రెండో రోజు బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో కూడా అదే ఊపు కొనసాగుతోందని మేకర్స్ భావిస్తున్నారు.