NagaChaitanya Dhootha2 Begins with Nagarjuna clap
ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’తోనే సెన్సేషన్ సృష్టించాడు యువసామ్రాట్ నాగచైతన్య. సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఓటీటీ డెబ్యూతోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్న చైతన్య.. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు ‘దూత 2’ తో మరోసారి సిద్ధమవుతున్నాడు.
NagaChaitanya Dhootha2 Begins with Nagarjuna clap
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ శుక్రవారం అధికారిక పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కింగ్ నాగార్జున క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. తొలి సీజన్ కంటే మరింత భారీ స్థాయిలో, మరింత డార్క్ అండ్ ఇంటెన్స్ కథతో ‘దూత 2’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


మరోసారి నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తొలి భాగాన్ని రూపొందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగచైతన్య, శరత్ మరార్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మొదటి సీజన్ సాధించిన విజయంతో ఇప్పటికే ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సీజన్లో నటించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ సీజన్2లో నటిస్తున్నారు.