Nani The Paradise Teaser
నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైంది. ఇప్పటికే పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్, ‘ఆయా షేర్’ పాటతో భారీ అంచనాలు ఏర్పడగా.. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
Nani The Paradise Teaser
“ఇక నుంచి ఈ జాగా ఎవరిది… ఈ దేశం ఎవరిది?” అంటూ నాని చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రక్తం చిందించే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ విజువల్స్, భారీ స్థాయి మేకింగ్‌తో టీజర్ ప్రతి క్షణం గూస్బంప్స్ పుట్టించేలా రూపొందించారు.
శ్రీకాంత్ ఓదెల విజన్ టీజర్‌లోని ప్రతి షాట్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ డార్క్, వైలెంట్ ప్రపంచాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. విజువల్ డిజైన్, యాక్షన్ స్కేల్, మేకింగ్ క్వాలిటీ ప్రతి అంశంలో సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునేలా కనిపిస్తోంది.
నాని ఈ చిత్రంలో తన కెరీర్లో ఎన్నడూ కనిపించని రగ్డ్, ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. జడలతో ఉన్న కొత్త లుక్, కళ్లలోని క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌లో చూపించిన ఇంటెన్సిటీ ఆయన కెరీర్లో మరో మైలురాయి పాత్రగా నిలవబోతోందనే సంకేతాలను ఇస్తోంది.
టీజర్ చివర్లో “ఇరుగు దిష్టి… పొరుగు దిష్టి…” అంటూ నాని చెప్పిన డైలాగ్ పర్ఫెక్ట్ క్లైమాక్స్‌గా నిలిచింది. థియేటర్లలో ఈ డైలాగ్‌కు విజిల్స్ ఖాయమనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది.
మోహన్ బాబు పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తూ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది. అలాగే కయదు లోహర్, రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ప్రతి యాక్షన్ బ్లాక్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా బీజీఎం రూపొందింది. SLV సినిమాస్ నిర్మాణ విలువలు కూడా టాప్ క్లాస్‌గా కనిపిస్తున్నాయి.
నెవర్ బిఫోర్ లుక్‌లో నాని, శ్రీకాంత్ ఓదెల గ్రాండ్ విజన్, అనిరుధ్ బీజీఎం, భారీ విజువల్స్ కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ పాన్-వరల్డ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.