Nagababu Launches MailuRayi Title
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మహిళా నిర్మాత తన ప్రయాణాన్ని ప్రారంభించారు. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు నాగబాబు విడుదల చేశారు. యువ ప్రతిభావంతులతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ లాంచ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Nagababu Launches MailuRayi Title
హన్సి ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం. 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తుండగా, జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగబాబు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైలురాయి’ అనే టైటిల్ ఆసక్తికరంగా ఉందని, హన్సిక తన కెరీర్‌ను మంచి సినిమాతో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కొత్త దర్శకుడు, యువ హీరోతో సినిమా నిర్మించాలనే ఆమె ప్రయత్నాన్ని అభినందించారు.
సినిమా నిర్మాణంలో మహిళలు చూపించే బాధ్యత, క్రమశిక్షణ ప్రశంసనీయమని పేర్కొన్న నాగబాబు.. స్వప్న దత్, ప్రియాంక దత్, నిహారిక కొణిదెల, సుప్రియ యార్లగడ్డ వంటి మహిళలు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని గుర్తుచేశారు. హన్సిక కూడా వారి బాటలో పయనిస్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
తన తొలి నిర్మాణ ప్రయత్నం గురించి నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తమ బ్యానర్‌పై రూపొందుతున్న మొదటి సినిమా ‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను నాగబాబు ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే టీజర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ‘మైలురాయి’ని ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నామని చెప్పారు. సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్ర బృందాన్ని ప్రోత్సహించిన నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందని, షూటింగ్ పూర్తయిందని తెలిపారు. నాగబాబు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని, త్వరలో టీజర్, పాటలు, ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ‘మైలురాయి’ని రూపొందించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.