Shekhar Kammula Praises Dear Astronaut
విభిన్నమైన కథాంశాలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో రూపొందుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సాంగ్ లాంచ్ కార్యక్రమానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.
Shekhar Kammula Praises Dear Astronaut
గొప్ప సందేశంతో రూపొందిన చిత్రం
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఆస్ట్రోనాట్ కావాలనే ఓ అమ్మాయి కల, ఆ కల చుట్టూ కథను అల్లిన విధానం తనకు నచ్చిందని తెలిపారు. సినిమాలో నటి చక్కగా నటించిందని ప్రశంసించారు. ఎంత పెద్ద కలలైనా కనవచ్చని, వాటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నించవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా అందిస్తోందన్నారు. సాంకేతికంగానూ చిత్రం ఎంతో నాణ్యతతో కనిపిస్తోందని, ‘డియర్ ఆస్ట్రోనాట్’ ఓ గొప్ప సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరించాలని కోరారు.
ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే కథ
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ.. ‘డియర్ ఆస్ట్రోనాట్’ వంటి కథాప్రాధాన్య చిత్రం చేయడం ఒక సాహసమని అన్నారు. ఓ అమ్మాయి, ఆమె భావోద్వేగాలు, కలలు, ఆశయాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని చెప్పారు. కలలు నిజమవుతాయో లేదో తెలియకపోయినా, పెద్ద కలలు కనడం, వాటిని సాధించేందుకు ప్రయత్నించడం ముఖ్యమనే సందేశం ఈ చిత్రంలో ఉందన్నారు. కథ విన్నప్పుడే అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు.
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ.. తన కెరీర్లో శేఖర్ కమ్ముల పాత్ర ఎంతో ఉందని, దర్శకుడు కార్తీక్ భాగ్యరాజ తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చారని తెలిపారు. సౌమిత్ అద్భుతంగా నటించారని ప్రశంసిస్తూ, నవంబర్ 20న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
అందమైన ప్రేమకథ.. స్ఫూర్తినిచ్చే ప్రయాణం
హీరోయిన్ శ్రేయసి సేన్ మాట్లాడుతూ.. ‘డియర్ ఆస్ట్రోనాట్’లో అందమైన ప్రేమకథతో పాటు ప్రేక్షకులను స్ఫూర్తినిచ్చే అంశాలు ఉన్నాయని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరో సౌమిత్ మాట్లాడుతూ.. సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని, ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులు అనుబంధం ఏర్పరచుకుంటారని అన్నారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కూడా ఈ విజయానికి భాగస్వామి అవుతారని పేర్కొంటూ, దర్శకుడు కార్తీక్‌కు ధన్యవాదాలు తెలిపారు.
నటి గీతా భాస్కర్ మాట్లాడుతూ.. ‘డియర్ ఆస్ట్రోనాట్’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమని, ఇలాంటి మంచి సినిమాను రూపొందించిన కార్తీక్‌కు అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా తనకు గుర్తింపు వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
లిరిసిస్ట్ గడ్డం వీరు ఈ చిత్రానికి రెండు పాటలు రాశానని, తనకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాల శైలిని గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుందని, తనకు నచ్చిన కథ కావడంతో పనిచేశానని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. సినిమాను ఇప్పటికే చూశానని, దర్శకుడు కార్తీక్ భాగ్యరాజ ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణవేణి మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ భాగ్యరాజ, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఈ సినిమాకు బలంగా నిలిచారని, నటీనటులందరూ అద్భుతంగా నటించారని అన్నారు.
కెమెరామెన్ చిత్రానికి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలనే స్ఫూర్తిదాయక సందేశం ఈ చిత్రంలో ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మేఘన మాట్లాడుతూ.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారని, ఆయన సహకారం సినిమాకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.