Muhurtham Fixed for Megastar 158th Film
ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సక్సెస్ జోష్‌లోనే నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధం అవుతున్నారు. ఆయన తర్వాతి సినిమాను దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చేయనున్నారు. ఇటీవల ఓ క్రేజీ పోస్టర్‌తో ఈ మూవీని అనౌన్స్ చేయగా ఆదివారం మరో అదిరిపోయే అప్‌డేట్ అందించారు. చిరంజీవి కెరీర్‌లో ఆయన నటిస్తున్న 158వ సినిమా కావడంతో మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి జిమ్ చేస్తున్న వీడియోతో ఈ అప్‌డేట్ ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ‘‘ప్రతి రోజూ పరిధులను అధిగమించడానికి లభించే మరొక అవకాశం” అంటూ వీడియోను షేర్ చేస్తూ ఈ నెల 21న ఈ మూవీ ప్రారంభోత్సవం జరగనున్నట్లు ప్రకటించారు.
వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21 ముహూర్తం.. KVN ప్రొడక్షన్స్ వారిది..అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ” .
Muhurtham Fixed for Megastar 158th Film
ఇక ఈ వీడియోలో చిరంజీవి చేస్తున్న ఎక్స్‌సర్‌సైజులు ఇన్‌స్పైర్ చేసేలా ఉన్నాయి. చిరంజీవి చేస్తున్న ఫిట్‌నెస్ ట్రైనింగ్ వీడియో అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ వయసులోనూ మెగాస్టార్ కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చిరంజీవి ఎనర్జీ, డెడికేషన్ చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మే 21న జరగనున్న పూజా కార్యక్రమంతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుండగా, త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. చిరంజీవి, బాబీ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మెగాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.




