ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన సినిమా ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. మే 22న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ ఇలా ముచ్చటించారు.

‘‘ మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నాన్న గారు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. నన్ను యాక్టర్‌‌ను చేయాలనేది నాన్న కోరిక. నాకు కూడా ప్యాషన్ ఉండటంతో చిత్రపరిశ్రమలోకి వచ్చా. వైజాగ్‌లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. ఆయన వద్ద నేను ఎంతో నేర్చుకున్నాను.

డీఓపీ సతీష్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని అనుకున్నాం. అందుకే నా మొదటి మూవీగా ఇలాంటి ఓ ఫ్యామిలీ కథతో వస్తున్నా. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఈ మూవీని రూపొందించాం. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు.

ఈ చిత్రంలో వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి సహా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. అందరూ నాకు ఎంతో సహకరించారు. అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. మా సినిమా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ ప్రయాణంలో సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ నాకు తెలిశాయి.

డైరెక్టర్ వీరు అన్న నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నేను చాలా ఇంట్రోవర్ట్‌గా ఉండేవాడ్ని. నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఆయన ఇచ్చిన సహకారంతోనే సినిమాని బాగా చేయగలిగాను.

‘పురుష:’ సినిమాని ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. విడుదలైన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. నా ఫ్రెండ్స్ అయితే నన్ను యాక్షన్ చిత్రాలు చేయమని సలహాలు ఇస్తుంటారు. కానీ ఏ జానర్‌లో సినిమా చేసినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలన్నదే లక్ష్యం.

 

  • Related Posts

    ప్రేమకథలా కనిపించే సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘మరీచిక

    Mareechika Trailer Raises Thrill Ahead of May 29 Release : అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో సతీష్ కాసెట్టి రూపొందిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై రాజీవ్ చిలక, మేఘా…

    ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

    • By Nani
    • May 18, 2026
    • 3 views
    పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

    కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

    • By Nani
    • May 18, 2026
    • 8 views
    కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

    చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

    • By Nani
    • May 17, 2026
    • 4 views
    చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

    ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

    • By Nani
    • May 17, 2026
    • 5 views
    ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

    ‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

    • By Nani
    • May 17, 2026
    • 12 views
    ‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

    రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

    • By Nani
    • May 17, 2026
    • 7 views
    రాజస్థాన్‌లో ‘వృషకర్మ’