Idupu Kayitham ReleaseDate Announcement
ప్రియదర్శి హీరోగా ఇటీవల ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ టైటిల్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తక్కువ సమయంలోనే చిత్రానికి విశేష ప్రచారం లభించగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Idupu Kayitham ReleaseDate Announcement
తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్, హ్యూమర్, స్థానిక సంస్కృతిని చూపిస్తూ రూపొందుతున్న ఈ ఎంటర్టైనింగ్ డ్రామాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై దర్శకుడు సుకుమార్ భార్య తబిత, బన్నీ వాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, ఎం.ఎన్.బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీధర్ సొంపల్లి ఎడిటర్‌గా, ఆశిష్ తేజ ఆర్ట్ డైరెక్టర్‌గా, అశ్వత్ భైరి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.