MegaStar Chiranjeevi ‘Kaka’ Title Glimpse
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే అనగానే మెగాభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి రోజు రానే వచ్చింది. శనివారం చిరు బర్త్‌డే సందర్భంగా ఆయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు పవర్ఫుల్, మాస్ లేదా కమర్షియల్ టచ్ ఉన్న టైటిల్స్ కనిపిస్తుంటాయి. కానీ చిరంజీవి సినిమా కోసం ఇంత క్యాచీగా, కాస్త వెరైటీగా ఉన్న ‘కాకా’ అనే పేరును ఎంచుకోవడమే ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది.
MegaStar Chiranjeevi ‘Kaka’ Title Glimpse
‘కాకా’ అనే పదం వినగానే ప్రేక్షకుల మనసులో ముందుగా ఒక ప్రశ్న వస్తోంది. ఈ టైటిల్ వెనుక అసలు కథ ఏమిటి? సినిమా కథానాయకుడి పేరు ‘కాకా’నా? లేక పాత్ర స్వభావానికి సంబంధించిన పదమా? లేదా కథలోని ఏదైనా ప్రత్యేకమైన భావానికి ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందా? టైటిల్ గ్లింప్స్ ఈ ప్రశ్నలకు పూర్తిస్థాయి సమాధానం చెప్పకుండా, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఇదే గ్లింప్స్ ప్రధాన బలం అని చెప్పొచ్చు. కథ మొత్తాన్ని ముందుగానే బయటపెట్టకుండా, టైటిల్ చుట్టూ ఒక మిస్టరీని క్రియేట్ చేయడం ద్వారా చిత్రబృందం ప్రమోషన్స్‌కు సరైన ఆరంభం ఇచ్చింది.
MegaStar Chiranjeevi ‘Kaka’ Title Glimpse
ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అందరి బాగోగులు చూసుకునే అన్నయ్యగా (కాకా) కూల్ లుక్‌లో కనిపించిన మెగాస్టార్… ఆ తర్వాత మాస్ లుక్‌లోకి మారారు. వెపన్స్, మాఫియా బ్యాక్ డ్రాప్‌గా ఈ స్టోరీ ఉండబోతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. సత్యం పాత్రలో కనిపిస్తున్న చిరంజీవిని సునీల్ వచ్చి సత్యం అన్నయ్య వారం రోజులు సెలవులు కావాలని అడగ్గా, అరెయ్ మన టార్గెట్ పండగరా.. అప్పటివరకు ఎవరికీ సెలవులు లేవు అని చిరు చెప్పడం సినిమా మూడ్‌ను తెలియజేస్తుంది. ఆ తర్వాత గెటప్ శ్రీను వచ్చి సత్యం గారండీ… బండి తాళాలు అంటూ ఇవ్వబోతుంటే పైన ఉన్న చిరు.. దాన్ని విసిరేయమంటారు. దీంతో అది కింద ఉన్న నీళ్లలో పడిపోతుంది. దాన్ని బయటకు తీయడానికి ఒక అయస్కాంతం లాంటి దాన్ని నీళ్లలోకి పంపించగా దానికి కొన్ని గన్స్‌తోపాటు బండి తాళం బయటకు తీస్తూ చిరు లుక్‌ను రివీల్ చేయడం ఆకట్టుకుంది. ఇందులో ఆయన ఓ సాధారణ వ్యక్తిగా కనిపిస్తూ నుదిటిపై బొట్టుతో కూల్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు ఆ బండి తాళంపై ‘‘ఐ లవ్ డాడీ’.. కనిపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. చిక్ చిక్ చేలమ్.. అంటూ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మెగాస్టార్ వింటేజ్ సినిమాలను గుర్తుచేస్తుంది. వీడియో చివరిలో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గతంలో చిరు, బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో రెండో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి.