Kiran Abbavaram Mythology With Indraputra
వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘క’, ‘కె ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు తొలిసారి ఎపిక్ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటించనున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా, శ్రీకాంత్ పుప్పాల కాంబినేషన్లో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఇంద్రపుత్ర – ఫస్ట్ ఛాప్టర్’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు.
Kiran Abbavaram Mythology With Indraputra
‘క’తో థ్రిల్లర్, ‘కె ర్యాంప్’తో మాస్ ఎంటర్టైనర్, ‘చెన్నై లవ్ స్టోరీ’తో ఎమోషనల్ లవ్ స్టోరీని ఎంచుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోబోతున్నారు. ప్రస్తుతం ‘కెఎ 13’, సుకుమార్ రైటింగ్స్‌లో ‘కెఎ 14’తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ‘కెఎ 15’గా ఈ భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు.
Kiran Abbavaram Mythology With Indraputra
మన పురాణ ఇతిహాసాల్లోని ధర్మం, అధర్మం మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘ఇంద్రపుత్ర’ కథను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ అంశాలను మేళవిస్తూ గ్రాండ్ స్కేల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ పుప్పాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఇంద్రపుత్ర – ఫస్ట్ ఛాప్టర్’లో కిరణ్ అబ్బవరం పవర్ఫుల్ రోల్లో సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు. భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో మేకర్స్ ఓ ప్రత్యేకమైన మైథాలజీ వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తన్ కథను అందించగా, కుస్సుమ్ అరోరాతో కలిసి ప్రేరణ అరోరా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ.. ‘‘ఇంద్రపుత్ర – ఫస్ట్ ఛాప్టర్’తో ఎంతో ప్యాషన్‌తో ఒక సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నాం. మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందిన అంశాలను తీసుకుని, నేటి ట్రెండ్‌కు అనుగుణమైన మేకింగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మేము క్రియేట్ చేయబోయే మైథాలజీ యూనివర్స్‌లో ఈ సినిమా తొలి అడుగు మాత్రమే. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ప్రేక్షకులకు ఓ ఎపిక్ స్టోరీని అందించబోతున్నాం. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కాస్ట్ అండ్ క్రూ వివరాలు, ఫస్ట్ లుక్, ఇతర కీలక అప్డేట్స్ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.