Keerthy Suresh First Look as Latha Reddy
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేష్.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాత్రతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ఆమె లతా రెడ్డిగా కనిపించనున్నారు. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, పాత్రను పరిచయం చేశారు.
Keerthy Suresh First Look as Latha Reddy
ఇందులో లంగాఓణీతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తలపగాతో ట్రాక్టర్ నడుపుతూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న కీర్తి సురేష్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. తనదైన గ్రేస్, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో లతా రెడ్డి పాత్రలో ఆమె ఎలా మెప్పించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్లతో పాటు కృతి శెట్టి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం.. ఇప్పుడు కీర్తి సురేష్ లుక్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచింది.

‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. టైటిల్‌కు సూట్ అయ్యేలా ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.