JAAN First Look: A Love Story of Forever
ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య ఉండే అనుబంధం కాదు.. కష్టాల్లోనూ ఒకరికొకరు తోడుగా నిలిచే ప్రయాణం. అలాంటి హృదయస్పర్శమైన భావోద్వేగాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘JAAN’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది ఓ అందమైన ప్రేమకథతో పాటు బలమైన ఎమోషనల్ జర్నీని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
JAAN First Look: A Love Story of Forever
ఆర్యన్ గౌర రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తుండగా.. మోనిషా మోహన్ కథానాయికగా కనిపించనున్నారు. రావు రమేష్, బాబా భాస్కర్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీల్‌చైర్‌లో కూర్చున్న మోనిషా వెనుక ఆర్యన్ నిలబడి, ఆమెకు తోడుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య మోనిషా చిరునవ్వు, పోస్టర్‌పై కనిపించే ‘Forever’ అనే పదం ఈ ప్రేమకథలోని బంధానికి మరింత అర్థాన్ని తీసుకొస్తున్నాయి. ఇక వీల్‌చైర్‌ను టైటిల్ డిజైన్‌లో భాగం చేయడం పోస్టర్లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో పోస్టర్లో కనిపించే క్యూట్ డాగ్ కూడా ఈ ఫస్ట్ లుక్కు మరింత సహజమైన, ఆహ్లాదకరమైన టచ్‌ను అందిస్తోంది.
జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ‘అమరన్’ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకోవడంతో ఆయన ఖాతాలో మూడు నేషనల్ అవార్డులు చేరాయి. గతంలో ‘సూరరై పొట్రు’, ‘వాతి’ చిత్రాలకు కూడా ఆయన నేషనల్ అవార్డులను అందుకున్నారు. దీంతో ‘JAAN’ సంగీతంపై కూడా ఆసక్తి నెలకొంది.
లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథలో ప్రేమ, అనుబంధం, నమ్మకం, జీవిత ప్రయాణంలో ఒకరికొకరు అండగా నిలిచే బంధం ప్రధానంగా ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు.