I Hate Marriage – Beyond Boldness
ప్రేమ, పెళ్లి, కెరీర్.. ఈ మూడింటి మధ్య నేటి యువత ఎదుర్కొంటున్న సంఘర్షణలు, వారి ఆలోచనలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’. సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో పరమేష్ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
I Hate Marriage – Beyond Boldness
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సమాజంలో బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని కొన్ని డార్క్ సీక్రెట్స్, ధైర్యంగా చర్చించాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు. కొత్త దర్శకుడైనప్పటికీ పరమేష్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా కథను తెరకెక్కించారని ప్రశంసించారు. ముగ్గురు అమ్మాయిల ప్రయాణం, ఒక అబ్బాయి జీవితంలోని సంఘటనలతో సాగే ఈ కథను ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా మలిచారని తెలిపారు. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలకు కమర్షియల్ అంశాలను జోడించిన ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
హీరోయిన్ జుప్సీ భద్ర మాట్లాడుతూ.. కథ వినగానే ఎంతో బలమైన కథాంశంతో కూడుకున్న సినిమా అనిపించిందని, దర్శకుడు ఎంతో స్పష్టతతో తెరకెక్కించారని చెప్పారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మాట్లాడుతూ.. ‘‘సమాజంలో మన కళ్లముందు జరిగే కొన్ని సంఘటనల గురించి బయటకు మాట్లాడుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ అలాంటి విషయాలపైనే రకరకాల చర్చలు జరుగుతుంటాయి. అలాంటి వాస్తవ సంఘటనల సమాహారమే ‘ఐ హేట్ మ్యారేజ్’. ట్రైలర్ చూసిన కొందరు ఇంత బోల్డ్ కంటెంట్‌తో ఎందుకు సినిమా చేస్తున్నావని అడిగారు. కానీ ఇది బోల్డ్ సినిమా కాదు.. మెచ్యూర్డ్ కంటెంట్‌తో కూడిన హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు. ప్రేమించుకుంటున్నారు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం తల్లిదండ్రులు చూసిన సంబంధాలకే ఎందుకు అంగీకరిస్తున్నారు? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? కుటుంబంతో తమ ప్రేమ గురించి ఎందుకు పోరాడలేకపోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు తమకు తెలిసిన వ్యక్తుల జీవితాలనే తెరపై చూస్తున్నామనే అనుభూతి పొందుతారు. ముఖ్యంగా Gen Z యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది కేవలం బోల్డ్ సినిమా కాదు.. మనసుకు హత్తుకునే ప్రేమకథ. దర్శకుడిగా ఈ సినిమా విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత మాదం దయానంద్ మాట్లాడుతూ.. విజయ్ సి. కుమార్ వంటి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తమ చిత్రానికి పనిచేయడం ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నారు. నేటి Gen Z యువత ప్రేమ, పెళ్లి, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. సహజమైన సన్నివేశాలు, భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. దర్శకుడు పరమేష్లో ఎంతో పట్టుదల, సినిమా పట్ల అంకితభావం ఉన్నాయని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయనతో చాలా కాలం ప్రయాణించానని, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరమేష్ ప్రతిభ అందరికీ తెలుస్తుందని, సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఎడిటర్ ఆవుల వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది సాధారణ ప్రేమకథ కాదని, ఎంతో మెచ్యూరిటీతో తెరకెక్కించిన కథ అని పేర్కొన్నారు. దర్శకుడు పరమేష్‌ను ప్రోత్సహించేందుకు ఆయన స్నేహితులు సైతం సహకరించారని తెలిపారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.