Priyanka Jain’s Special Prayer for Shiva
బిగ్‌బాస్ హౌస్‌లో ఏర్పడిన అనుబంధం.. హౌస్ బయట కూడా అంతే బలంగా కొనసాగుతోంది. తన స్నేహితుడు శివ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో విజయం సాధించాలని కోరుకుంటూ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శివ టైటిల్ గెలవాలనే ఆకాంక్షతో ఏడుకొండలవాడి సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ వార్త ఇప్పుడు బిగ్‌బాస్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Priyanka Jain’s Special Prayer for Shiva
ప్రియాంక జైన్ తిరుమల యాత్ర వెనుక ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ఉంది. గతంలో ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ఆమె విజయం కోసం శివ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఇప్పుడు అదే అభిమానాన్ని ప్రియాంక తిరిగి చూపించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న శివ విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె స్వయంగా తిరుమలకు వెళ్లారు. గతంలో తన కోసం శివ చేసిన ప్రార్థనలను గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు శివ కోసం తాను శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నట్లు ప్రియాంక తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. శివ బిగ్‌బాస్ టైటిల్ సాధించాలని, అతని ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో తనదైన ఆటతీరుతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. శివ పట్ల తనకున్న అభిమానాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటుకున్నారు. ఒకరి కోసం మరొకరు ప్రార్థనలు చేసుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బిగ్‌బాస్ హౌస్‌తో మొదలైన ఈ సెంటిమెంట్ ఇప్పుడు తిరుమల యాత్రతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రియాంక జైన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రయాణం నుంచి దర్శన ఏర్పాట్ల వరకు RL Tours and Travels సహకారం అందించింది. సంస్థ CEO & Founder అనురాధ చెట్టి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయం చేశారు.
విమాన టికెట్లు, వసతి, ఆహారం, ఆతిథ్యం, తిరుపతి నుంచి తిరుమలకు రవాణా వంటి సదుపాయాలతో పాటు TTD దర్శన టికెట్లకు సంబంధించిన సహకారం, దర్శన ఏర్పాట్ల సమన్వయం వంటి సేవలను సంస్థ అందించింది. ప్రియాంక కూడా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా RL Tours and Travels, అనురాధ చెట్టికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా RL Tours and Travels వివిధ రకాల దేశీయ, అంతర్జాతీయ పర్యటనలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా తిరుమల యాత్రలకు సంబంధించి రవాణా, వసతి, దర్శన టికెట్ల సహాయం, ఇతర ప్రయాణ అవసరాల సమన్వయంలో సేవలు అందిస్తోంది. సంస్థ CEO & Founder అనురాధ చెట్టి ఆధ్వర్యంలో ప్రముఖుల పర్యటనలకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.