AMB Victory Joins UFO Network
హైదరాబాద్‌లో సినిమా అనుభూతికి సరికొత్త నిర్వచనం ఇచ్చే దిశగా మరో కీలక అడుగు పడింది. నగరంలోని ప్రముఖ ప్రీమియం మల్టీప్లెక్స్ AMB విక్టరీ, ఇప్పుడు UFO సినీ మీడియా నెట్‌వర్క్‌లో భాగస్వామిగా చేరింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రేక్షకులకు మరింత అత్యుత్తమమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందుబాటులోకి రానుంది.
AMB Victory Joins UFO Network
ఏడు అత్యాధునిక స్క్రీన్లతో పాటు ప్రత్యేకంగా IMAX స్క్రీన్‌ను కలిగి ఉన్న AMB విక్టరీ ఇప్పటికే హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు ఫేవరెట్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్లకు UFO సినీ మీడియా నెట్వర్క్ అత్యాధునిక 4K RGB లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని అందించనుంది. ఈ టెక్నాలజీ ద్వారా మరింత స్పష్టమైన చిత్రాలు, అద్భుతమైన రంగులు, అత్యుత్తమ విజువల్ క్వాలిటీతో ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
ఈ భాగస్వామ్యం UFO సినీ మీడియా నెట్వర్క్ విస్తరణలో మరో ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రముఖ థియేటర్ యాజమాన్యాలతో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రపంచస్థాయి సినిమా ప్రొజెక్షన్ టెక్నాలజీని అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్ని చేకూర్చనుంది.
AMB సినిమాస్‌తో ఈ అనుబంధం సుదీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాలని, భవిష్యత్తులో ప్రేక్షకులకు మరిన్ని అత్యుత్తమ సినిమా అనుభూతులను అందించాలని UFO నెట్వర్క్ ఆకాంక్షిస్తోంది.
ఈ భాగస్వామ్యానికి అవకాశం కల్పించిన శ్రీ సునీల్ నారంగ్, శ్రీ భరత్ నారంగ్, శ్రీ జ్యేష్ఠ్ నారంగ్‌లకు UFO సినీ మీడియా నెట్వర్క్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ఈ అనుబంధం సాకారం కావడంలో సహకరించిన శ్రీ దగ్గుబాటి సురేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.