Heroine Satvika Veeravalli Glamour Gallery
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా హీరోయిన్ సాత్విక వీరవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాతో హీరోయిన్గా పరిచయం కావడం ఆనందంగా ఉందని, ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే పాత్రలో నటించానని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం సాత్విక వీరవల్లికి సంబంధించిన అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఫొటో గ్యాలరీపై ఓ లుక్కేయండి.
Heroine Satvika Veeravalli Glamour Gallery































