Heroine Anaswara Rajan Photo Gallery
మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఇట్లు అర్జున’లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంతో మహేష్ ఉప్పల దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నవంబర్ 13న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో అనస్వర సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, తమన్ సంగీతానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయని తెలిపింది. మరోవైపు తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!
Heroine Anaswara Rajan Photo Gallery







