Ashok Galla Visa Unveils Melodic Treat
యంగ్ హీరో అశోక్ గల్లా, టాలెంటెడ్ నటి శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా : వింటారా సరదాగా’ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మంచి స్పందన దక్కించుకోగా.. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Ashok Galla Visa Unveils Melodic Treat
ఈ కొత్త పాటకు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చగా, సనారే అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ తన మధురమైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశాడు. “నువ్వొచ్చాకే మైకంలో మనసంత తేలిందే.. నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేంటో తెలిసిందే.. నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే.. నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే.. చెలియా నువ్వు నా తోడుంటే లోకాన్నే గెలిచేస్తానే.. చింగారి.. నా చిరునవ్వుల ఓ సింగారి..” అంటూ సాగే ఈ గీతం ప్రేమలో మునిగిపోయిన ఇద్దరి మనసుల్ని అందంగా ఆవిష్కరిస్తోంది.
ఈ పాటలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జోడీ స్క్రీన్‌పై ఎంతో స్టైలిష్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్ పాట అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా, రిచ్‌గా కనిపిస్తూ సాంగ్‌ను ఒక విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి.
ప్రేమ, వినోదం, యూత్‌ఫుల్ ఎమోషన్స్ కలబోసిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన టీమ్.. ఒక్కో పాటతో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.