Mythri Launches Dhruv Vikram New Movie
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పుడు తమిళంలోనూ అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ వంటి సినిమాలతో కోలీవుడ్‌లో తన మార్క్ చూపించిన ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ.. తాజాగా తన నాలుగో తమిళ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈసారి విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా రంగంలోకి దిగుతున్నాడు.
Mythri Launches Dhruv Vikram New Movie
ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గురువారం చెన్నైలోని మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్ కొట్టగా.. అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ వంటి సినీ ప్రముఖులు హాజరై టీమ్‌కు విషెస్ తెలిపారు.
ఇక ధృవ్ విక్రమ్ విషయానికి వస్తే.. వర్మ, మహాన్, బైసన్ వంటి సినిమాలతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న అతడికి ఇది నాలుగో చిత్రం. ఇప్పటివరకు ఎక్కువగా ఇంటెన్స్, ఎక్స్పెరిమెంటల్ పాత్రల్లో కనిపించిన ధృవ్.. ఈసారి మాత్రం పూర్తిగా రూట్ మార్చేస్తున్నాడు. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్తో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.
మొత్తానికి.. ధృవ్ విక్రమ్ కెరీర్లో ఇది ఓ కీలక మలుపు కావొచ్చని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, మరోవైపు కమర్షియల్ ప్యాకేజింగ్.. ఈ కాంబో చూస్తుంటే ధృవ్‌కు ఇది స్ట్రాంగ్ మాస్ లాంచ్‌లా మారే ఛాన్స్ కనిపిస్తోంది.