Raja The Raja Producer KNiharika Dasari Photos
బ్రదర్ కోసం నిర్మాతగా మారిన నిహారిక దాసరి.. ‘రాజా ది రాజా’తో కొత్త ప్రయాణం
తన సోదరుడు రుత్విక్‌ను హీరోగా పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా మారిన కె. నిహారిక దాసరి, ‘రాజా ది రాజా’ చిత్రాన్ని నిర్మించారు. జులై 17న విడుదల కానున్న ఈ సినిమాకు అనిల్ బోయిడపు దర్శకత్వం వహించారు. రుత్విక్ నటనపై పూర్తి నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించానని నిహారిక తెలిపారు. సినిమాలో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని, అందుకోసం రుత్విక్ మెథడ్ యాక్టింగ్‌తో పాటు రిస్కీ యాక్షన్ సన్నివేశాలను కూడా స్వయంగా చేశాడని చెప్పారు. హీరోయిన్ విశాఖ ధిమాన్తో పాటు సాయికుమార్, నరేష్, అవసరాల శ్రీనివాస్ వంటి సీనియర్ నటులు చిత్రానికి బలంగా నిలిచారని పేర్కొన్నారు. అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Raja The Raja Producer KNiharika Dasari Photos
నిర్మాతగా నిహారిక దాసరి ఫొటో గ్యాలరీని చూసేందుకు కింద ఉన్న గ్యాలరీని క్లిక్ చేయండి.










