Korean Kanakaraju Teaser Fun Horror Comedy
రాయలసీమ మాస్, కొరియన్ మిస్టరీ, హారర్ కామెడీ… ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ ప్రేక్షకులకు వినూత్నమైన ట్రీట్ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విడుదలైన టీజర్లో నవ్వులు, యాక్షన్, ఫాంటసీ, హారర్ అంశాలను ఒకే ఫ్రేమ్‌లో ప్యాక్ చేసినట్టు కనిపిస్తోంది. పెనుగొండకు చెందిన అల్లరి కుర్రాడు కనకరాజు జీవితం… కొరియన్ అమ్మాయి ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడితో ఆగకుండా ఓ రహస్యమైన డ్రాగన్ పాత్రలో దాగి ఉన్న అతీంద్రియ శక్తి అతన్ని ఆవహించడంతో సాధారణ కనకరాజు కాస్తా ‘కొరియన్ కనకరాజు’గా మారిపోతాడు. ఈ పాయింట్‌ను టీజర్లో రివీల్ చేసిన విధానం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Korean Kanakaraju Teaser Fun Horror Comedy
వరుణ్ తేజ్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించడం టీజర్‌కు ప్రధాన ఆకర్షణ. రాయలసీమ యాసలో అమాయకంగా, అల్లరి కుర్రాడిలా కనిపించే ఆయన… చివర్లో కొరియన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాస్ ఫీలింగ్‌ను తీసుకొచ్చింది. సత్యతో కలిసి వచ్చే కామెడీ ట్రాక్ టీజర్‌కు మంచి ఎనర్జీని జోడిస్తే, రితికా నాయక్ కొరియన్ అమ్మాయిగా కథలో కొత్త కోణాన్ని తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
Korean Kanakaraju Teaser Fun Horror Comedy
మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు టీజర్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియన్ కల్చర్‌ను కలిపిన ప్రెజెంటేషన్ కొత్తగా అనిపిస్తోంది. విజువల్‌గా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి మలుపును మరింత ఎలివేట్ చేసింది.
మొత్తంగా చూస్తే ‘కొరియన్ కనకరాజు’ టీజర్ సాధారణ హారర్ కామెడీలా కాకుండా, రూరల్ మాస్ ఎంటర్టైనర్కు కొరియన్ ఫాంటసీ టచ్ జోడించిన కొత్త ప్రయత్నంలా కనిపిస్తోంది. నవ్వులు, థ్రిల్స్, మాస్ మూమెంట్స్ అన్నీ కలిసిన ఈ టీజర్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచింది. ఆగస్టు 7న ఈ వినూత్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు ‘కొరియన్ కనకరాజు’ సిద్ధంగా ఉన్నాడు.