Vijay Jana Nayakudu Movie Review Telugu
చిత్రం: జన నాయకుడు
రేటింగ్: 3/5 ⭐⭐⭐
నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరేన్, సునీల్, రేవతి తదితరులు
బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత : వెంకట్ కె నారాయణ
దర్శకత్వం : హెచ్ వినోద్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ): సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
విడుదల తేదీ: 23/7/2026
Vijay Jana Nayakudu Movie Review Telugu
కథ విషయానికొస్తే :
దళపతి వెట్రి కొండన్ అలియాస్ చిచ్చా (విజయ్) జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, తన తల్లి అంత్యక్రియలకు వెళ్లే అవకాశం కల్పించిన జైలు అధికారి (గౌతమ్ వాసుదేవ్ మీనన్) తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత దళపతి అతన్ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఈ క్రమంలో ఆ అధికారి కుమార్తె విజ్జి (మమితా బైజు)తో అతనికి అనుబంధం ఏర్పడుతుంది. అయితే అనుకోని ప్రమాదంలో జైలు అధికారి మరణించడంతో, అనాథగా మిగిలిన విజ్జి బాధ్యతను దళపతి తన భుజాలపై వేసుకుంటాడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం విజ్జిని ధైర్యవంతమైన ఆర్మీ ఆఫీసర్‌గా చూడాలనేది దళపతి లక్ష్యం. కానీ భయం, వీక్నెస్ ఫోబియా ఉన్న విజ్జి మాత్రం సాధారణ జీవితం గడపాలని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడాలని కోరుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలవుతాయి.
ఇదే సమయంలో దేశంలో మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలనే కుట్రను జాన్ హిమ్లర్ (బాబీ డియోల్), రాజకీయ నాయకుడు రోజా రంగసామి (ప్రకాశ్ రాజ్)తో కలిసి అమలు చేయాలని చూస్తాడు. ఈ కుట్ర వెనుక ఉన్న భయానక నిజాలు విజ్జి జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. విజ్జిలో పేరుకుపోయిన భయాన్ని తొలగించి, ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు దేశాన్ని ఆపద నుంచి కాపాడేందుకు దళపతి రంగంలోకి దిగుతాడు. ఈ ప్రయాణంలో కాయల్ (పూజా హెగ్డే) కూడా అతనికి అండగా నిలుస్తుంది. చివరికి జాన్ హిమ్లర్ కుట్రను దళపతి ఎలా భగ్నం చేశాడు? విజ్జిలోని భయాన్ని ఎలా జయింపజేశాడు? ఆమెను ధైర్యంగా తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే స్థాయికి ఎలా తీసుకెళ్లాడు? అనేది మిగతా కథ. ముఖ్యంగా, ‘జన నాయకుడు’ కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదు. మహిళల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం నింపే బలమైన సందేశాన్ని కూడా సినిమా అందిస్తుంది. భయాన్ని జయిస్తే ఏ మహిళైనా తన జీవితానికి తానే నాయకురాలు అవుతుందనే భావోద్వేగాన్ని దర్శకుడు కథలో ప్రభావవంతంగా చూపించారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
విజయ్ మరోసారి తన స్టార్డమ్కు తగ్గట్టే ఆకట్టుకున్నారు. చిచ్చా/దళపతి వెట్రి కొండన్ పాత్రలో యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా విజ్జితో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన హైలైట్‌గా నిలుస్తుంది. మమితా బైజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయంతో జీవించే అమ్మాయి నుంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువతిగా ఆమె ట్రాన్స్ఫర్మేషన్ బాగా చూపించారు. పూజా హెగ్డే పాత్ర చిన్నదే అయినా కథకు అవసరమైన చోట మంచి సపోర్ట్ ఇచ్చింది. బాబీ డియోల్ విలన్‌గా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ మరోసారి అనుభవం కనిపించే నటన కనబరిచారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించే కొద్దిసేపే అయినా తన పాత్రను గుర్తుండేలా చేశారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ నుంచి టెర్రరిస్ట్‌గా బాబీ డియోల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్‌ఫుల్‌గా ఉంది. నాజర్ సహా మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.
టెక్నీకల్ టీమ్ గురించి..
దర్శకుడు హెచ్. వినోద్ కమర్షియల్ అంశాలతో పాటు మంచి సామాజిక సందేశాన్ని కూడా జోడించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌ను ఎమోషన్స్‌తో నడిపిస్తే, సెకండ్ హాఫ్‌లో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేశారు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి బలం ఇచ్చింది. పాటలు కూడా తెరపై బాగానే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్‌గా తెరకెక్కాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఎంతో ఉన్నతంగా బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉన్నాయి.
Vijay Jana Nayakudu Movie Review Telugu
సినిమా ఎలా ఉందంటే..
‘జన నాయకుడు’ పూర్తిగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కమర్షియల్ ఎంటర్టైనర్. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, మెసేజ్.. ఇలా అన్ని అంశాలను కలిపి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మహిళల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంచే సందేశాన్ని కథలో మిక్స్ చేయడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కొన్ని చోట్ల కథ నెమ్మదించినా, విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎమోషన్ సినిమాను నిలబెడతాయి. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి చిత్రంలోని ‘బనావో భేటీ కో షేర్’ (అమ్మాయిని సివంగిలా పెంచాలి) అనే కోర్ పాయింట్ తీసుకుని తనదైన శైలిలో దర్శకుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంది. అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాల మధ్య ఘర్షణలు సృష్టించి అధికార పీఠం ఎక్కాలనుకుని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి నియంతలా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న వ్యక్తులను విజయ్ ఎలా సంహారిస్తాడు అనేది ఇంటరెస్టింగ్ చూపించారు. ‘భయం మనసులో ఉంటుంది… దాన్ని జయించిన రోజు నువ్వే నీ జీవితానికి నాయకురాలు’ అనే డైలాగ్ మహిళలకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ‘ధైర్యం అంటే గెలవడం కాదు… భయాన్ని ఎదుర్కోవడం’ అనే మాట క్లైమాక్స్‌కు మంచి ఎమోషన్‌ను తీసుకొస్తుంది. విలన్‌ను ఎదుర్కొంటూ విజయ్ చెప్పే ‘ప్రజల్లో భయం నింపాలనుకునేవాళ్లకు… నేను ధైర్యంగా నిలబడటం నేర్పిస్తా’ అనే డైలాగ్ మాస్ ఎలివేషన్‌ను ఇస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
ఎమోషనల్ కథతో పాటు మహిళలకు స్ఫూర్తినిచ్చే సందేశం
మమితా బైజు నటన
అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్
గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం కొంత తక్కువ
సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘జన నాయకుడు’ మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే కమర్షియల్ ఎంటర్టైనర్. విజయ్ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలతో పాటు మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపే మంచి సందేశాన్ని దర్శకుడు అందించారు. కథలో కొన్ని రొటీన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఎమోషన్స్, యాక్షన్, మెసేజ్, విజయ్ పెర్ఫార్మెన్స్ సినిమాను ఎంగేజింగ్‌గా నిలబెడతాయి. ఈ వీకెండ్ ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకునే వారికి ‘జన నాయకుడు’ మంచి ఎంపికనే చెప్పాలి.