ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమాను ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లిన ఘనత మన ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో గ్లోబల్ లెవల్లో మంచి గుర్తింపును అందుకోవడమే కాదు.. టాలీవుడ్‌కు కూడా ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టారు రాజమౌళి. తాజాగా ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లోబల్ ప్రెజెంటేన్ను మెక్సికోలో నిర్వహించారు. ‘సినీకాన్ ఎక్స్‌పీరియెన్స్’ (CCXP 2026’ ఈవెంట్లో ‘వారణాసి’ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెజెంటేషన్ ద్వారా గ్లోబల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రపంచవేదికపై ‘వారణాసి’ టీమ్‌కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ‘వారణాసి’ సినిమాకు సంబంధించి బీహైండ్ సీన్స్ (బీటీఎస్) ప్రదర్శించే సమయంలో కొంతమంది ప్రేక్షకులు బయటకు వెళ్తున్నట్టు కనిపించిన తాజా విజువల్స్ చర్చకు దారి తీస్తున్నాయి. అలాగే ఇలాంటి గ్రాండ్ ఈవెంట్లో ఖాళీగా కనిపిస్తున్న సీట్లను చూపిస్తూ పలువురు నెగిటివ్ ట్రెండ్ మొదలుపెట్టారు. వీడియోలో కొందరు బయటకు వెళ్తున్నట్లు కనిపించడంతో “వాక్అవుట్” అనే నెరేటివ్ కూడా మొదలైంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. “ఇది ఎంబరాసింగ్” అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఇండియన్ ఆడియన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. మరోవైపు ఇలాంటి విమర్శలను ఫ్యాన్స్ ఖండించారు. ఇతర ఫోటోల్లో హాల్ బాగా నిండినట్లు చూపించారు. ఇంత పెద్ద ఈవెంట్లో మధ్య మధ్యలో మూవ్మెంట్ కామన్ అని అన్నారు. వీడియోలో ఉన్నవారు బయటకు వెళ్లడం కాదు, సీట్లు వెతుక్కుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. ‘వారణాసి’ విషయంలో ఒక ఆసక్తికరమైన డిబేట్ మొదలైంది . ఇది నిజంగా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్న స్ట్రాటజీనా?, లేక ముందుగా ఇండియన్ మార్కెట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి గత ట్రాక్ రికార్డ్ చూస్తే, ఆయన సినిమాలు స్థానిక కథలతోనే గ్లోబల్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ప్రారంభం నుంచే అంతర్జాతీయ మార్కెట్‌పై ఫోకస్ పెట్టడం ఒక కొత్త ప్రయోగంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రపంచ వేదికపై Avengers: Doomsday, Dune Part Three వంటి భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల ‘వారణాసి’కి ఇంటర్నేషనల్ లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది.
‘వారణాసి’ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ పాల్గొన్న ప్యానెల్లో సినిమా స్థాయి, విజన్ గురించి చర్చ జరిగింది. ScreenRant కు చెందిన లియామ్ క్రౌలీ ఈ సెషన్‌ను మోడరేట్ చేయగా, ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, BTS విజువల్స్ కూడా చూపించి సినిమాపై వరల్డ్‌వైడ్‌గా మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.
అలాగే చిత్ర దర్శకులు రాజమౌళి వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులతో మాట్లాడుతూ.. భారతీయ కథలను ప్రపంచానికి చేరవేయడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. “మన సంస్కృతి, మన కథల్లో ఉన్న ఎమోషన్ యూనివర్సల్. అవి ప్రపంచ ప్రేక్షకులను కూడా కనెక్ట్ చేస్తాయి” అని తెలిపారు. తన సినిమాల నిర్మాణంలో విజువల్ గ్రాండియర్‌తో పాటు భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తానని రాజమౌళి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తన గత చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎలా ప్రపంచానికి దగ్గరయ్యాయో గుర్తుచేస్తూ, ‘వారణాసి’లో గ్లోబల్ ఎలిమెంట్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. కథ చెప్పడానికి భాష అనే అడ్డంకి ఉండదని.. భావోద్వేగం, మానవ అనుభవాలే అసలు మూలమని… అవే తన తదుపరి చిత్రం #Varanasi కి బలమైన పునాది అని చెబుతూ… ఇది తన కెరీర్లోనే అత్యంత ఆత్మీయమైన, అంబిషస్ ప్రాజెక్ట్”అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తానని హామీ ఇచ్చారు.
ఇక ‘వారణాసి’ చిత్ర విషయానికొస్తే.. ఇదొక టైమ్ ట్రావెల్, మైథాలజీ, హిస్టరీ, సైన్స్ ఫిక్షన్ కలయికగా తెరకెక్కుతోంది.
మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథను అందించగా, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
ఫైనల్‌గా ఒక ఈవెంట్లో కనిపించిన కొన్ని విజువల్స్‌తో సినిమా భవిష్యత్తు నిర్ణయించడం తొందరపాటు నిర్ణయం కావచ్చు. కానీ అదే సమయంలో, గ్లోబల్ ప్రమోషన్స్‌లో ప్రతి చిన్న డిటైల్ కూడా పెద్ద చర్చగా మారే కాలం ఇది. ‘వారణాసి’ విషయంలో ఇది ఒక చిన్న అలజడి మాత్రమే. అసలు సమాధానం మాత్రం సినిమా విడుదలయ్యే రోజునే తెలుస్తుంది.





