పెద్ద సినిమాల కొరతను తీర్చిన ‘డార్లింగ్’

సమ్మర్ సీజన్ అనగానే ఒకప్పుడు మిడ్ రేంజ్ నుంచి స్టార్ నుంచి హీరోల సినిమాల వరకు అన్నీ థియేటర్ దగ్గర క్యూ కట్టేవి. కానీ ఇటీవల కాలంలో భారీ బడ్జెట్‌లు, హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో దాదాపు రెండు, మూడేళ్ల వరకు ఒకే సినిమాకు ఫిక్స్ అయిపోతున్నారు స్టార్ హీరోలు. దీంతో సీజన్‌తో సంబంధం లేకుండా సినిమా ఎప్పుడు పూర్తయితే అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమ్మర్‌‌లో పెద్ద సినిమాల కొరత బాగాకనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ‘డార్లింగ్’ రూపంలో మరోసారి థియేటర్ల దగ్గర సందడి తీసుకొచ్చారు. ఈనెల 23న 4కే రీ రిలీజ్‌తో ఇటు ఫ్యాన్స్‌తోపాటు అటు థియేటర్లకు కొత్త జోష్‌ను తీసుకొచ్చారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ 16 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మళ్లీ విడుదల చేశారు. ఈ రీ రిలీజ్‌లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం, దాదాపు రూ.2.5 కోట్ల షేర్ రాబట్టడం ఈ రీ- రిలీజ్‌కు గొప్ప విజయంగా నిలిచింది. కేవలం రూ.1.25 కోట్ల హక్కులు, ఖర్చులతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ కలెక్షన్లు కొనసాగనున్నాయనే అంచనాలు ఉన్నాయి.
ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో మళ్లీ ప్రేక్షకుల రద్దీ పెరిగింది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఆక్యుపెన్సీ మెరుగుపడటం, ఎగ్జిబిటర్లకు ఊరటనిస్తోంది. పాత క్లాసిక్ సినిమాలకు ఇప్పటికీ డిమాండ్ ఉందని ఇది మరోసారి స్పష్టం చేసింది.

“తొలిప్రేమ” ఫేమ్ ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ప్రభాస్, కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, వినోదాత్మక కథనం, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ప్రభు, శ్రద్ధా దాస్, కోట శ్రీనివాసరావు, అహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మాణ్యం, ముకేష్ రిషి, శ్రీనివాస రెడ్డి, ప్రభాస్ శ్రీను, తులసి, వంశీ కృష్ణ ముఖ్య పాత్రల్లో మెప్పించారు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్