ట్రంప్ పాలసీలపై అటాక్ చేయనున్న ‘గాయపడ్డ సింహం’

తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ ‘గాయపడ్డ సింహం’ విడుదలకు ముందు నుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలను లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ Donald Trump పాలనను నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న బజ్‌ను పెంచింది. అమెరికా కలలతో వెళ్లిన ఓ యువకుడు, కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ కావడం.. ఆ తర్వాత అతని జీవితంలో జరిగే పరిణామాలను డార్క్ హ్యూమర్‌‌తో ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. ట్రంప్ పాలసీల వల్ల ఎఫెక్ట్ అవుతున్న వేలాది మంది యువత సమస్యను ఇందులో చూపించారు. దీంతో ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. తనపై ఎలా అటాక్ చేశాడనేది ఆసక్తికరంగా ట్రైలర్‌‌ను కట్ చేశారు.
ట్రైలర్‌లోని ఫన్, ఎమోషన్, సెటైర్స్ అన్ని ఫుల్ ప్యాకేజ్‌లా అనిపించాయి. తరుణ్ భాస్కర్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తమ పాత్రలతో కథకు గ్లామర్ జోడించగా, జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్స్‌లో ఆకట్టుకుంటున్నారు. శ్రీ విష్ణు స్పెషల్ అప్పీయరెన్స్ ట్రైలర్‌‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లోబల్ ఇష్యూలను యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుల్కల్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ నిజంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ప్రతి షాట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కచ్చితంగా సమ్మర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను” అని తెలిపారు. కథలో ఉన్న యూనివర్సల్ కనెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ, “ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. సరైన విధంగా వర్క్ అయితే ‘జాతిరత్నాలు’ తరహాలో భారీ విజయాన్ని అందుకుంటుంది” అని అన్నారు. ‘గాయపడ్డ సింహం’ చిత్రం ప్రేక్షకులకు ఒక ఫన్ రైడ్‌తో పాటు ఆలోచింపజేసే అంశాలను కూడా  అందించబోతుందని మూవీ టీమ్ చెప్పింది.

 

 

 

 

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్