Ravi Teja ‘Irumudi’ v/s Nani ‘Paradise’
టాలీవుడ్లో 2027 ఆగస్టు 21 తేదీపై ఒక్కసారిగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’ విడుదల తేదీగా ఆగస్టు 21ను ప్రకటించారు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ మూవీ టీమ్ కూడా అదే తేదీని రిలీజ్ డేట్‌గా ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Ravi Teja ‘Irumudi’ v/s Nani ‘Paradise’
దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై పడింది. నిజంగానే నాని, రవితేజ మధ్య భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతుందా? లేక ‘ప్యారడైజ్’ వాయిదా పడుతుందనే నమ్మకంతోనే ‘ఇరుముడి’ మేకర్స్ ఆ డేట్‌ను లాక్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘ప్యారడైజ్’పై భారీ అంచనాలు
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ప్యారడైజ్’ నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ ప్రమోషనల్ మెటీరియల్ నేషనల్ వైడ్‌గా ట్రెమండెస్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తేదీకి తీసుకురావాలనే ప్రయత్నం నిర్మాతల నుంచి ఉండటం సహజం. అయితే సినిమా స్కేల్ చాలా పెద్దది కావడం, భారీ విజువల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
‘ఇరుముడి’ మేకర్స్ లెక్క ఇదేనా?
రవితేజ ‘ఇరుముడి’ చిత్రానికి ఆగస్టు 21 తేదీని ప్రకటించడాన్ని చాలా మంది వ్యూహాత్మక నిర్ణయంగా చూస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతాయి. ఏదైనా పెద్ద పండుగల సమయాల్లోనే ఇలా జరుగుతాయి. ముఖ్యంగా రెండు భారీ సినిమాలు ఒకే మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నప్పుడు నిర్మాతలు క్లాష్‌ను నివారించడానికి ప్రయత్నిస్తుంటారు.
Ravi Teja ‘Irumudi’ v/s Nani ‘Paradise’
ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ టీమ్‌కు ‘ప్యారడైజ్’ షెడ్యూల్‌పై ఏదైనా స్పష్టత ఉందా? లేక సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భావించి ముందుగానే ఆ డేట్‌ను ఆక్రమించిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండస్ట్రీలో గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ఒక సినిమా ప్రకటించిన తేదీకి మరో సినిమా రావడం, చివరి నిమిషంలో ఒకటి వెనక్కి తగ్గడం తరచూ జరిగే విషయమే.
క్లాష్ జరిగితే ఎవరికీ లాభం?
నాని, రవితేజ ఇద్దరికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. ఇద్దరి సినిమాలకు ఓపెనింగ్స్ కూడా బలంగానే వస్తాయి. అయితే ఒకే రోజు విడుదలైతే థియేటర్ల డిస్ట్రిబ్యూషన్, షోల కేటాయింపు, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ‘ప్యారడైజ్’ పాన్ ఇండియా చిత్రం కావడంతో నార్త్ ఇండియన్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేస్తోంది. మరోవైపు ‘ఇరుముడి’ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోంది. కాబట్టి ప్రేక్షకుల వర్గాలు కొంతవరకు వేర్వేరుగా ఉన్నప్పటికీ, తెలుగు మార్కెట్లో మాత్రం పోటీ తప్పదు.
చివరి నిర్ణయం విడుదలకు దగ్గర్లోనే?
ప్రస్తుతం చూస్తే రెండు చిత్రాలూ ఆగస్టు 21 తేదీని అధికారికంగా ప్రకటించాయి. కానీ టాలీవుడ్లో రిలీజ్ డేట్లు మారడం కొత్త విషయం కాదు. షూటింగ్ స్టేటస్, పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్ లెక్కలు, థియేటర్లు దొరికే సంఖ్య వంటి అంశాల ఆధారంగా చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
Ravi Teja ‘Irumudi’ v/s Nani ‘Paradise’
అందుకే ప్రస్తుతం ‘ప్యారడైజ్’ ‘ఇరుముడి’ క్లాష్ ఖాయమని చెప్పడం కంటే, పరిస్థితులను గమనిస్తున్న నిర్మాతలు సరైన సమయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఒకవేళ ఇద్దరూ వెనక్కి తగ్గకుండా అదే తేదీని కొనసాగిస్తే, ఆగస్టు 21న టాలీవుడ్‌కు ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరు చూడాల్సి రావచ్చు.
మరి చివరికి ఎవరు డేట్ మార్చుకుంటారు? లేక నాని-రవితేజ నేరుగా బాక్సాఫీస్ రింగ్‌లో దిగుతారా? అనేది రాబోయే వారాల్లో తేలనుంది.