Rashmika Mysaa Song
‘బాణాలకు నెత్తుటితో తాణాలు పోయాలే.. ధనుస్సు మీద మనసు పెట్టి పసుపు చిలకరించాలే..’ అంటూ వీరనారి శక్తిని చాటుతోంది ‘మైసా’ ఫస్ట్ సాంగ్. రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ఓ మైసా రే’ పాటను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రష్మిక లుక్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా రిలీజైన ఈ పాట మరింత అంచనాలను పెంచుతోంది.
Rashmika Mysaa Song
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ పవర్ఫుల్ లిరిక్స్ రాయగా.. సింధూజ శ్రీనివాసన్ తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఇందులో మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబించారు.
‘‘శత్రువుల పుట్టుకపై కత్తులనే నూరాలే.. దాయే దాయే ఈషి.. బాణాలకు నెత్తుటితో తాణాలు పోయాలే.. ధనుస్సు మీద మనసు పెట్టి పసుపు చిలకరించాలే.. పిడికిళ్లతో కొడవళ్లను ముడుపు కట్టుడే..’’ అంటూ సాగే ఈ పాట మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తోంది. ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని నింపుతోంది. ఇందులో గోండ్ గిరిజన మహిళగా రష్మిక కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పాటకు హైలైట్‌గా నిలిచింది.
అటవీ నేపథ్యం, భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు ఈ పాట గొప్ప అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.