Ram Charan and Shruti Haasan Pair Repeat for ‘Peddi’ Special Song
రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ సినిమాలో జంటగా మెప్పించిన వీరిద్దరూ ఇప్పుడు మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోనున్నారు. అయితే ఈసారి పూర్తి సినిమాకోసం కాదు.. మాస్ స్టెప్పులతో అదిరిపోయే స్పెషల్ సాంగ్ కోసం.
‘పెద్ది’ చిత్రంలో ఉండబోయే “హెల్లల్లల్లో” స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ చిన్న ప్రోమోతోనే సోషల్ మీడియాలో మాస్ వైబ్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ స్టైల్, శృతి హాసన్ గ్లామర్, ఇద్దరి మధ్య కనిపించిన ఎనర్జిటిక్ కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ ఆ హైప్‌ను మరింత పెంచేసింది. ప్రోమోలో కనిపించిన విజువల్స్, మాస్ బీట్లు, రామ్ చరణ్ డాన్స్ మూవ్స్ సినిమాకు మరో హైలైట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.
Ram Charan and Shruti Haasan Pair Repeat for ‘Peddi’ Special Song
ఇక ముఖ్యంగా శృతి హాసన్ ఎంట్రీ ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌తో ఆమె కనిపించడంతో సోషల్ మీడియాలో వీరి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని తెలుస్తోంది.
ఫుల్ సాంగ్‌ను మే 23న భోపాల్‌లో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ నిర్వహించనున్న లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ లో ఈసాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
Ram Charan and Shruti Haasan Pair Repeat for ‘Peddi’ Special Song
ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రై రై రారా సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేశాయి. అలాగే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ కూడా అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూన్ 4న భారీ అంచనాల మధ్య వరల్డ్‌వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.