Akhil Akkineni: Lenin Teaser :
టాలీవుడ్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున సినీ ప్రయాణం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు. ఆయన చిన్న కొడుకు
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. “మనోడు వస్తున్నాడు” అనే ఒక్క డైలాగ్‌తోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
Akhil Akkineni: Lenin Teaser :
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై మంచి అంచనాలు పెంచగా.. తాజాగా వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. “నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన” అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా చిత్తూరు యాసలో ఆయన పలికించిన డైలాగ్స్, రగ్డ్ బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. భాగ్యశ్రీ బోర్సే తన గత చిత్రాలకు భిన్నంగా పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. స్టేజ్‌పై నాటక ప్రదర్శనలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌లను ఆమె చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. అఖిల్-భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపిస్తుండగా, విజువల్స్ సినిమాకు ప్రత్యేకమైన టోన్‌ను తీసుకొచ్చాయి. అఖిల్ కూడా ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. పీరియాడిక్ విలేజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంటెన్స్ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉండనున్నట్టు టీజర్ స్పష్టం చేస్తోంది. ఇందులో శివాజీ, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలం కాగా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత రిచ్‌గా చూపించింది. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మరో ప్లస్‌గా నిలవనున్నాయి.
Akhil Akkineni: Lenin Teaser :
మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.