Raju Weds Rambai Team Casting Call
చిన్న చిత్రంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తర్వాత, ఆ చిత్ర మేకర్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. తెలంగాణ మట్టివాసనతో కూడిన మరో గ్రామీణ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మిస్తుండగా, మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Raju Weds Rambai Team Casting Call
తమ కొత్త చిత్రంలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకు మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. తెలంగాణ యాస, భాష తెలిసిన వారందరూ తమ వీడియోలను పంపాలని కోరారు. నటనపై ఆసక్తి, ప్రతిభ కలిగిన వారికి ఇది మంచి అవకాశంగా నిలవనుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపవద్దని స్పష్టం చేసిన మేకర్స్, ఆసక్తి గల వారు తమ వీడియోలు మరియు ఇతర వివరాలను [dsf.production02@gmail.com](mailto:dsf.production02@gmail.com) మెయిల్‌కు పంపవచ్చని లేదా 8096411437 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని తెలిపారు.
Raju Weds Rambai Team Casting Call
ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట గ్రామ భవితవ్యాన్ని ఎలా మార్చింది? వారిలో ఎవరు గెలిచినా ఊరు మాత్రం ఎందుకు ఓడిపోయింది? రామాయణంలోని రామ-లక్ష్మణుల్లా కలిసుండాల్సిన సోదరులు మహాభారతంలోని పాత్రల్లా ఎందుకు విభేదించారు? అనే ఆసక్తికర ప్రశ్నల చుట్టూ ఈ కథ సాగనుంది. “ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలు ఏమి జరిగింది?” అనే ప్రశ్నతో మేకర్స్ విడుదల చేసిన కాస్టింగ్ కాల్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.