Priyanka Mohan as Korea Brand Ambassador
నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఏడేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ తెలుగుతోపాటు తమి, కన్నడ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది ప్రియాంక మోహన్. గతేడాది పవన్ కళ్యాణ్‌కు జోడీగా ‘ఓజీ’ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక కెరీర్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భారతీయ ప్రేక్షకులకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆమెకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ఆమెను కొరియా పర్యాటక రంగ గౌరవ అంబాసిడర్‌గా నియమించింది.
Priyanka Mohan as Korea Brand Ambassador
ప్రియాంక మోహన్ నటించని ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను అందుకోవడంతో ఆమె పేరు ఇంటర్నేషనల్ లెవల్లో వినిపించింది. ఈ నేపథ్యంలో భారతీయ ప్రేక్షకులకు కొరియా సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను మరింత చేరువ చేసే లక్ష్యంతో KTO ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంకా మోహన్‌కు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వివిధ దేశాల్లోనూ గణనీయమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఈ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొరియా పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి కొరియాపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో ఆమె ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
Priyanka Mohan as Korea Brand Ambassador
ఈ గౌరవ బాధ్యత దక్కడం పట్ల ప్రియాంకా మోహన్ ఆనందం వ్యక్తం చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన కొరియా ప్రభుత్వం, కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో కొరియా అందాలను, అక్కడి సంస్కృతిని మరింత మందికి పరిచయం చేయడానికి కృషి చేస్తానని పేర్కొంది.
సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియాంక మోహన్, ఇప్పుడు పర్యాటక రంగ ప్రచారంలోనూ అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఈ గౌరవం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.