Mass Surprise for NBK 111 Birthday
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటిస్తున్నారు. బాలయ్య నటిస్తున్న 111వ సినిమా కావడంతో ‘ఎన్బీకే 111’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
Mass Surprise for NBK 111 Birthday
జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా “మీకు తెలిసిన, మీరు గుర్తుంచుకున్న బాలకృష్ణ కాదు… మీరు అస్సలు ఊహించని బాలకృష్ణ. ఇకపై వింటేజ్ కాదు… న్యూ ఏజ్ మాత్రమే” అనే ట్యాగ్‌లైన్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
Mass Surprise for NBK 111 Birthday
పోస్టర్లో కనిపిస్తున్న భారీ చైన్లు, బుల్లెట్లు, అలాగే ‘ఎన్బీకే పట్ల జాగ్రత్త’ అనే వార్నింగ్ స్టైల్ డిజైన్ సినిమాకు మాస్ టోన్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈసారి బాలయ్యను పూర్తిగా కొత్త అవతారంలో, గత చిత్రాలకు భిన్నమైన లుక్‌తో చూపించబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ టీజర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అభిమానులు జూన్ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mass Surprise for NBK 111 Birthday
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే ‘వీర సింహారెడ్డి’తో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.