వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నారు నితిన్. తాజాగా తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా నారి సిరిసవాడ, సోమశేఖర్ టి అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రకటించారు. నితిన్ ఇమేజ్‌కు సరిపోయేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్తదనాన్ని కలిపి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో నితిన్ సరసన ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. సంగీత బాధ్యతలను సురేష్ బొబ్బిలి నిర్వహిస్తుండగా, సినిమాటోగ్రఫీని అనిత్ మదాడి చేపట్టారు. కళా దర్శకత్వాన్ని జానీ షేక్ నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన సాంకేతిక బృందం కలిసి ఈ చిత్రాన్ని దృశ్యపరంగా గొప్పగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. గతంలో ఈ నిర్మాణ సంస్థల కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
మే రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, షూటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. బలమైన కథ, ప్రతిభావంతులైన తారాగణం, అనుభవజ్ఞులైన సాంకేతిక బృందం కలయికలో వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతోనైనా నితిన్ మంచి హిట్ అందుకుంటారేమో చూద్దాం.






👍