“సతీ లీలావతి’’గా ఎంటర్‌‌టైన్ చేస్తా – లావణ్య త్రిపాఠి కొణిదెల

ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మనసులో శృతి)’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం సందర్భంగా హీరోయిన్ లావణ్య మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సినిమాపై నమ్మకం, ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ
‘‘సతీ లీలావతి’ సినిమా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. నేను, నా మేనేజర్ కలిసి చూస్తూ బాగా నవ్వుకున్నాం. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా కూడా టచ్ చేస్తాయి. మెసేజ్ ఉన్నా అది హితబోధలా అనిపించదు.”

షూటింగ్ సమయంలో ప్రత్యేక అనుభవం
“ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్‌ను సాఫీగా పూర్తి చేశాను. ప్రతిరోజూ షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకునేదాన్ని. యాక్షన్ సన్నివేశాలు కూడా చేశాను. ఒక సీన్‌లో కాలితో కొట్టాల్సి వచ్చింది అది కొంచెం కష్టంగా అనిపించింది కానీ మంచి అనుభవం.”

పాత్ర గురించి..
“ఈ చిత్రంలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. కథలో రిలేషన్‌షిప్స్ చూపించిన విధానం రియల్ లైఫ్‌లో ఉండకూడదనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఎవరూ ఎదుర్కొరకూడదు.”

ఫ్యామిలీ సపోర్ట్
“నా భర్త వరుణ్ తేజ్ ఎప్పుడూ నాకు అండగా ఉంటారు. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ప్రస్తుతం నా భర్త, నా బిడ్డతో చాలా హ్యాపీగా ఉన్నాను.”

సినిమా టీమ్ గురించి
“దేవ్ మోహన్ గారు అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి. ఆయన ఈ చిత్రానికి స్వయంగా డబ్బింగ్ చెప్పారు. నేనూ నా పాత్రకు డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే సీనియర్ నటులు నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు.”

చరణ్ బావ సపోర్ట్
“రామ్ చరణ్ బావ గారు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారు. మా ట్రైలర్ విడుదల చేయడం మాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. చిరంజీవి గారు కూడా మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఆయనకు ట్రైలర్ చూపించాలని ఉంది.”

క్లాసిక్‌తో పోలికపై స్పందన
“కమల్ హాసన్ గారి ‘సతీ లీలావతి’ ఒక క్లాసిక్. మా సినిమాను దానితో పోల్చకూడదు. మా సినిమా పూర్తిగా వినోదాత్మకంగా, కొత్త తరహాలో సాగుతుంది.”

భవిష్యత్తు ప్రణాళికలు
“ప్రస్తుతం నేను కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. కొంత గ్యాప్ తీసుకుని నా ఫ్యామిలీతో సమయం గడపాలని అనుకుంటున్నాను. నా కొడుకుతో ఉండడమే నాకు పెద్ద ఆనందం. భవిష్యత్తులో మంచి కథ వస్తే వరుణ్‌తో కలిసి నటించే ఆలోచన ఉంది.”

చివరిగా…
“‘సతీ లీలావతి’ ఒక రిఫ్రెషింగ్, ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరినీ నవ్వించే, ఆకట్టుకునే సినిమా అవుతుంది.”

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on ““సతీ లీలావతి’’గా ఎంటర్‌‌టైన్ చేస్తా – లావణ్య త్రిపాఠి కొణిదెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’