భాగ్యశ్రీ బోర్సే.. భారీ ఆఫర్స్‌తో బర్త్‌డే ట్రీట్

తనదైన నటనతో ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. బుధవారం (మే 6)న తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌ను విడుదల చేసి భాగ్యశ్రీకు బర్త్‌డే విషెస్ తెలియచేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో భాగ్యశ్రీ బోర్సే ధరించిన రాజసిక వేషధారణ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బంగారు కిరీటం, భారమైన ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ఇవన్నీ కలిపి ఆమెను ఒక శక్తివంతమైన చారిత్రక పాత్రలో చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ముఖ కవళికలు, కళ్లలో కనిపించే ఆత్మవిశ్వాసం, పాత్రలోని గంభీరతను అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. ఆమె పోషిస్తున్న “భారతి” పాత్ర ప్రేక్షకులను “మంత్ర ముగ్ధుల్ని చేసి, గెలుచుకునేలా” ఉంటుందని తన క్యారెక్టర్‌‌ను రివీల్ చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌‌ను ట్వీట్‌ చేసిన ‘లెనిన్’ టీమ్ ఆమెను “రేడియంట్” అండ్ “సుప్రీమ్ టాలెంటెడ్” అని అభివర్ణించడం, ఇండస్ట్రీలో ఆమెకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ లుక్స్, భాగ్యశ్రీ గెటప్, సాంగ్స్, టీజర్‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో మరింత హైప్ తీసుకొచ్చారు. ఎడిటింగ్‌లో నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్షన్‌లో కొల్లా అవినాష్​, సినిమాటోగ్రఫీలో లియోన్ బ్రిట్టో వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం ఈ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మరో మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్ అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌కు జంటగా ఆమె నటిస్తున్న చిత్రం ‘సియోన్’. ఈ సినిమా నుంచి వచ్చిన ఈ స్పెషల్ పోస్టర్‌లో భాగ్యశ్రీ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. బ్యాంగిల్స్ షాప్ బ్యాక్‌డ్రాప్‌లో, చేతిలో నెమలి ఈక పట్టుకుని, కూల్ అండ్ కాన్ఫిడెంట్ పోజ్‌లో కనిపించిన భాగ్యశ్రీ క్యారెక్టర్‌పై ఆసక్తిని పెంచుతోంది. ట్రెడిషనల్ లుక్‌తో పాటు అట్ట్రాక్టివ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పోస్టర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ పోస్టర్ చూస్తే సినిమాలో భాగ్యశ్రీ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తుండగా, లెజెండరీ నటుడు కమల్ హాసన్ సమర్పిస్తున్నారు. సంతోష్ నారాయణణ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

మొత్తానికి, బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్స్‌తో భాగ్యశ్రీ బోర్సే మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆమె అందం మాత్రమే కాదు, నటనలోని లోతు, పాత్రకు తగ్గట్టుగా మారిపోయే సామర్థ్యం ఆమెను ఇతర నటీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆమె పేరు అగ్రనటీమణుల సరసన నిలబడాలని కోరుకుంటూ మరోసారి పుట్టనరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on “భాగ్యశ్రీ బోర్సే.. భారీ ఆఫర్స్‌తో బర్త్‌డే ట్రీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’