New Guests at Jr Ntr Home.. for His Birthday NTR Shares a Special Bond with Macaws :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్‌లు, భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండే ఎన్టీఆర్.. ఈసారి తన వ్యక్తిగత జీవితంలోని ఒక అందమైన క్షణాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. తన ఇంట్లోకి రెండు అందమైన మకావ్ (Macaw) జాతికి చెందిన పక్షులను ఆహ్వానించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
New Guests at Jr Ntr Home.. for His Birthday NTR Shares a Special Bond with Macaws :
ఎన్టీఆర్ ఈ రెండు పక్షులకు జపాన్ భాషలో ఎంతో అర్థవంతమైన పేర్లు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒక పక్షికి ‘అసాహి’ (Asahi) అని పేరు పెట్టగా, దాని అర్థం “ఉదయం వచ్చే సూర్యకాంతి”. మరో పక్షికి ‘యూహి’ (Yuuhi) అని పేరు పెట్టారు. దాని అర్థం “అస్తమించే సూర్యుడు”. ఈ పేర్లు వినగానే అభిమానులు వాటి వెనకున్న భావాన్ని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో ఎన్టీఆర్ ఈ మకావ్ పక్షులతో ఎంతో సరదాగా, ప్రేమగా కనిపించారు. రంగురంగుల రెక్కలతో ఆకట్టుకునే ఈ పక్షులను తన భుజాలపై కూర్చోబెట్టి దిగిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా యాక్షన్, మాస్ ఇమేజ్‌తో కనిపించే ఎన్టీఆర్ ఇలా పక్షులతో ఎంతో సింపుల్‌గా, హాయిగా కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
New Guests at Jr Ntr Home.. for His Birthday NTR Shares a Special Bond with Macaws :
ప్రస్తుతం వరుస సినిమాలు, షూటింగ్‌లు, గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రకృతితో, జంతువులతో అనుబంధాన్ని ఇష్టపడతారని ఈ పోస్టుతో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు, పక్షులపై ప్రేమ చూపించే సెలబ్రిటీల జాబితాలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా చేరిందని చెప్పవచ్చు.
“అసాహి & యూహి చాలా క్యూట్‌గా ఉన్నాయి”, “తారక్ అన్నలో ఈ సాఫ్ట్ సైడ్ చాలా బాగుంది”, “బిజీ లైఫ్ మధ్య ఇలా నేచర్‌తో కనెక్ట్ అవడం సంతోషంగా ఉంది” అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఆయన కనిపించిన తీరు మాసీగా ఉంటూ ఫ్యాన్స్‌కు మెస్మరైజ్ చేస్తోంది.