Manchu Manoj Birthday Interview.. Shares Interesting Facts
సినిమాలతో పాటు సేవా మార్గం
‘ఐక్య’ కూడా మా బిడ్డలాంటిదే
టాలీవుడ్లో విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మే 20న తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొత్తగా ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ట్రస్ట్ నుంచి తన సినీ ప్రాజెక్టులు, అప్ కమింగ్ సినిమాల వరకు పలు అంశాలపై మాట్లాడారు.
‘ఐక్య’ ఆలోచన ఎలా మొదలైంది?
నేను, నా భార్య మౌనిక ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలోనుంచి పుట్టిందే ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ట్రస్ట్. నా పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్‌ను ప్రకటించాం. ప్రతి సమస్య దగ్గర వ్యక్తిగతంగా ఉండటం సాధ్యం కాదని, అందుకే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక వేదిక అవసరమని భావించి ‘ఐక్య’ ట్రస్ట్‌ను ప్రారంభించాం. వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉండేలా ఈ ట్రస్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ఐక్యంగా ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని భావించి ట్రస్ట్‌కు ‘ఐక్య’ అనే పేరు పెట్టాం. అలాగే నా కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన పేర్ల నుంచి స్ఫూర్తి తీసుకుని ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని నామకరణం చేశాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే.
ట్రస్ట్ లక్ష్యాలు ఏమిటి?
ఈ ట్రస్ట్‌కు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ట్రస్ట్ విధివిధానాలపై పని జరుగుతోంది. భవిష్యత్తులో సేవా కార్యక్రమాల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. జూన్ 7న ఈ ట్రస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం.
సినీ జర్నీ గురించి..?
ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి. నా కెరీర్‌కు మళ్లీ ఊపు తీసుకొచ్చిన దర్శకులు విజయ్ కనకమేడల, కార్తీక్ ఘట్టమనేనిలకు జీవితాంతం రుణపడి ఉంటా. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ గ్లింప్స్ నా పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం కంప్లీట్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల కీలక షెడ్యూల్ పూర్తిచేశాం.
కొత్త సినిమాలు.?
జూన్ 7న ‘రక్షక్’ టైటిల్‌తో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నా. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా. మహిళల సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో తెరకెక్కనున్న ‘రక్షక్’ చిత్రంలో డీసీపీ పాత్రలో కనిపించనున్నా. మరికొన్ని ప్రాజెక్టులు త్వరలోనే ప్రకటిస్తా.
Manchu Manoj Birthday Interview.. Shares Interesting Facts
మౌనిక, మీ మధ్య బాండింగ్ గురించి..?
మా నిర్ణయాలు ఒకరినొకరం గౌరవించుకుంటూ ఉంటాం. నా సినిమాల విషయంలో నా భార్య జోక్యం చేసుకోదు. అలాగే ఆమె పనుల్లో నేను జోక్యం చేసుకోను. ఒకరి ప్రొఫెషనల్ స్పేస్‌ను మరొకరు గౌరవిస్తాం.
రాజకీయాల్లోకి ఎంట్రీ?
మేము చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగాం. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేసే అవకాశం ఉంది. నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను..అది జనం పార్టీ (నవ్వుతూ).
మీ బర్త్‌డే రోజే.. ఎన్టీఆర్ ది కూడా బర్త్‌డే కదా మీ మధ్య బాండింగ్.?
ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పుట్టిన రోజు కూడా కావడంతో, వారితో నా పుట్టిన రోజు పంచుకోవడం గర్వంగా ఉంటుంది. ‘సిరివెన్నెల’ గారు లేకపోయినా పాట రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు.
‘వాట్ ది ఫిష్’ ఎందుకు ఆగింది?
నేను, సత్య, వెన్నెల కిశోర్ కలిసి చేయాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ముఖ్యంగా వీసా సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
మీరు క్రియేట్ చేసిన ‘మోహన రాగ మ్యూజిక్’ అప్డేట్..?
‘మోహన రాగ మ్యూజిక్’ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలు పూర్తయ్యాయి. మరికొన్ని ట్రాక్‌లు సిద్ధమవుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశముంది.
Manchu Manoj Birthday Interview.. Shares Interesting Facts
మీ భార్య మౌనిక ఏర్పాటు చేసిన ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ విస్తరణ ?
నా భార్య మౌనిక ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ బ్రాండ్‌పై దృష్టి పెట్టారు. త్వరలో బెంగళూరు సహా తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించబోతున్నాం.
మీ నాన్న గారితో రిలేషన్షిప్ గురించి.?
ఈ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు బాగా తెలుసు.. వెళ్లి అడగండి. కానీ మైక్ పట్టుకుని వెళ్లోద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి (నవ్వుతూ). ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నా.