NTR Dragon Glimpse The Davil was Born :
ద డెవిల్ వజ్ బోర్న్
ఈ కథలో అందరూ విలన్లే..
‘సలార్’ తరహాలోనే ‘డ్రాగన్’
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ప్రకటించినప్పట్నుంచీ ‘డ్రాగన్’ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆకలిని ప్రశాంత్ నీల్ తీర్చేశారు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఒకరోజు ముందుగానే మే 19న రాత్రి 11.50 నిమిషాలకు ‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్ చేసి బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. మాస్, యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ ప్రారంభం నుంచే డార్క్ మరియు ఇంటెన్స్ టోన్ కనిపిస్తుంది. భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు విజువల్స్ సినిమాపై హై లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. యాక్షన్ షాట్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించింది. కొద్ది నిమిషాల గ్లింప్స్‌తోనే సినిమా కథా ప్రపంచం ఎంత భారీగా ఉండబోతుందో మేకర్స్ స్పష్టమైన హింట్ ఇచ్చారు.
NTR Dragon Glimpse The Davil was Born :
గ్లింప్స్‌ను గమనిస్తే ఈ కథ బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంతో ప్రారంభమవుతుందనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన హెరాయిన్ అక్రమ రవాణా, దాని చుట్టూ తిరిగే మాఫియా నెట్‌వర్క్‌లను కథలో ప్రధానంగా చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. పలు దేశాల్లో జరిగే హెరాయిన్ వ్యాపారం, దానిపై ఆధిపత్యం కోసం పోరాడే గ్యాంగ్‌ల మధ్య యుద్ధమే సినిమా ప్రధాన కాన్సెప్ట్‌గా ఉండనుందని తెలుస్తోంది.
NTR Dragon Glimpse The Davil was Born :
ఈ నేపథ్యంలో ‘ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ’ మరియు ‘గోల్డెన్ ట్రేడింగ్ ట్రయాంగిల్’ అనే రెండు శక్తివంతమైన సంస్థల మధ్య ఘర్షణను ప్రశాంత్ నీల్ తన స్టైల్లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు గ్లింప్స్ ద్వారా అర్ధమవుతోంది. ఇందులో ఎన్టీఆర్ “లూగర్” అనే అత్యంత ప్రమాదకరమైన హంతకుడి పాత్రలో కనిపించాడు. ‘ద డెవిల్ వజ్ బోర్న్’ అంటూ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పరిచయం చేయడం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ‘దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’ అని చెబుతూ తన చేతిలో పెద్ద మెషిన్ గన్, చుట్టూ శవాల మధ్య ఉన్న సీన్ హైప్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సలార్‌లోని ప్రభాస్ గెటప్ తరహాలో ఎన్టీఆర్ కనిపిస్తూ.. ‘నిద్ర పోయినప్పుడు నా కలలోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు. మిగిలున్న శత్రువుల ముఖాలు మాత్రమే కనబడతాయి.. పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు.. ఈసారి హీరో మీరే అవ్వాలని ‘రఘువీర్ రాథోడ్’గా అనిల్ కపూర్‌ను ఆర్మీ ఆఫీసర్‌గా చూపించిన తీరు ఆకట్టుకుంది. రవి బస్రూర్ అందించిన సంగీతం మెస్మరైజ్ చేసింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, ఆశుతోష్ రానా, అంశుమాన్ పుష్కర్, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, బిమల్ జీత్ ఒబెరాయ్‌తో పాటు పలువురు విదేశీ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
NTR Dragon Glimpse The Davil was Born :
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘డ్రాగన్ గ్లింప్స్’ ట్రెండ్ అవుతోంది. “ఇది ఎన్టీఆర్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ మాస్ మూవీ అవుతుంది” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్ ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. సినిమా టెక్నికల్‌గా కూడా ఎంతో గ్రాండ్‌గా ఉండబోతుందనే సంకేతాలు గ్లింప్స్ ద్వారా స్పష్టమయ్యాయి. సినిమాటోగ్రఫీ, కలర్ టోన్, మ్యూజిక్ అన్నీ కలిసి ఒక భారీ యాక్షన్ డ్రామాను సూచిస్తున్నాయి. దర్శకుడు ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నాడనే ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలోనూ పెరిగింది. వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.